Indian Language Bible Word Collections
Proverbs 31:12
Proverbs Chapters
Proverbs 31 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Proverbs Chapters
Proverbs 31 Verses
1
|
రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి, |
2
|
నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమా రుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును? |
3
|
నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయ కుము |
4
|
ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు. |
5
|
త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు |
6
|
ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి. |
7
|
వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు. |
8
|
మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. |
9
|
నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. |
10
|
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. |
11
|
ఆమె పెనిమిటి ఆమెయందు నమి్మకయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. |
12
|
ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. |
13
|
ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును. |
14
|
వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును. |
15
|
ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. |
16
|
ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును. |
17
|
ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును |
18
|
తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. |
19
|
ఆమె పంటెను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. |
20
|
దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును |
21
|
తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. |
22
|
ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు. |
23
|
ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును. |
24
|
ఆమె నారబట్టలు నేయించి అమ్మునునడికట్లను వర్తకులకు అమ్మును. |
25
|
బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. |
26
|
జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును. |
27
|
ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు. |
28
|
ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి |
29
|
యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. |
30
|
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును |
31
|
చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. |