నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారియొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కఱ్ఱగా, అనగా వారి ప్రధానులందరియొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పండ్రెండు కఱ్ఱలను తీసికొని యెవరి కఱ్ఱమీద వారిపేరు వ్రాయుము.
కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱల మధ్యనుండెను.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుతిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.