1
|
అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. |
2
|
అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. |
3
|
అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియ మింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రా యేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. |
4
|
అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. |
5
|
అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. |
6
|
ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవత లను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి. |
7
|
యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక |
8
|
వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి. |
9
|
మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను |
10
|
అప్పుడు ఇశ్రాయేలీయులుమేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా |
11
|
యెహోవా ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశ ములో నుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీ యుల వశములోనుండియు మాత్రము గాక |
12
|
సీదోనీయు లును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షిం చితిని గదా |
13
|
అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను. |
14
|
పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టు కొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. |
15
|
అప్పుడు ఇశ్రా యేలీయులుమేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయ చేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి |
16
|
యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొల గింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను. |
17
|
అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి. ఇశ్రాయేలీయులును కూడుకొని మిస్పాలో దిగియుండిరి. |
18
|
కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలుఅమ్మోనీయులతో యుద్ధముచేయ బూనుకొనువాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని యొక నితో నొకడు చెప్పుకొనిరి. |
Judges 10:17 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...