నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.
కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడు నట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.
ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒక వేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.
రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధాను లందరును అక్కడ కూర్చుండి యుండిరి.
ఆ గ్రంథమును తెచ్చు టకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీ షామా గదిలోనుండి దాని తీసికొని వచ్చి రాజు వినికిడి లోను రాజనొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడి లోను దాని చదివెను.
లేఖికుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మె యేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దె యేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను.
మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెనుయెహోవా సెలవిచ్చునదేమనగాబబులోనురాజు నిశ్చ యముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;
అందుచేతను యూదారాజైన యెహో యాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుదావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.
నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకు లను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారిమీదికిని యెరూషలేము నివాసులమీదికిని యూదా జనులమీదికిని రప్పించుచున్నాను; అయినను వారు వినినవారుకారు.
యిర్మీయా యింకొక గ్రంథమును తీసికొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకుచేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటిమాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను; మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.