1
|
మరియు నరపుత్రుడా, గోగునుగూర్చి ప్రవచన మెత్తి ఇట్లనుముప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగారోషునకును మెషెకునకును తుబాలునకును అధి పతివైన గోగూ, నేను నీకు విరోధినైయున్నాను. |
2
|
నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తరదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతము లకు రప్పించి |
3
|
నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను, |
4
|
నీవును నీ సైన్యమును నీతోనున్న జను లందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహార ముగా నిన్ను ఇచ్చెదను. |
5
|
నీవు పొలముమీద కూలుదువు, నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
6
|
నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్వి చారముగా నివసించువారిమీదికిని అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు. |
7
|
నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను. |
8
|
ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
9
|
ఇశ్రా యేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును. |
10
|
వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చు చుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్ల పెట్టినవారి సొమ్ము తామే కొల్ల పెట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
11
|
ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్ర మునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు. |
12
|
దేశ మును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు. |
13
|
నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు. |
14
|
దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియ మించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు. |
15
|
దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టు దురు. |
16
|
మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. |
17
|
నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగాసకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుమునేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరు గును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు; |
18
|
బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు. |
19
|
నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. |
20
|
నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
21
|
నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్య జనులందరు చూచెదరు. |
22
|
ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహో వానైయున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు. |
23
|
మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెర లోనికి పోయిరనియు వారు విశ్వాస ఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలు నట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్య జనులు తెలిసికొందురు. |
24
|
వారి యపవిత్రతను బట్టియు అతిక్రమ క్రియలనుబట్టియు నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతికారము చేసితిని. |
25
|
కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ద నామమునుబట్టి రోషముకలిగినవాడనై యాకోబు సంతతివారిని చెరలోనుండి రప్పించెదను, ఇశ్రా యేలీయులందరియెడల జాలిపడెదను. |
26
|
వారు నాయెడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలోనుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములోనుండి రప్పిం చిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించునప్పుడు |
27
|
వారియందు అన్య జనులనేకముల యెదుట నన్ను పరిశుద్ధ పరచుకొందును. |
28
|
అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియ్యక తమ దేశమునకు వారిని సమ కూర్చిన సంగతినిబట్టి నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. |
29
|
అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. |
Ezekiel 39:24 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...