1
|
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. |
2
|
భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. |
3
|
అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయ మును ప్రేరేపించెను.? |
4
|
అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమి్మన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమా |
5
|
అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను; |
6
|
అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. |
7
|
ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. |
8
|
అప్పుడు పేతురుమీరు ఆ భూమిని ఇంతకే అమి్మతిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. |
9
|
అందుకు పేతురుప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ |
10
|
వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. |
11
|
సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. |
12
|
ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటప ములో ఉండిరి. |
13
|
కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని |
14
|
ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. |
15
|
అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి. |
16
|
మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి. |
17
|
ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారంద రును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని |
18
|
అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. |
19
|
అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి |
20
|
ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. |
21
|
వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితోకూడ నున్న వారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించివారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. |
22
|
బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెర సాలలో కనబడనందున తిరిగివచ్చి |
23
|
చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. |
24
|
అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి. |
25
|
అప్పుడు ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా |
26
|
అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను. |
27
|
వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా |
28
|
ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. |
29
|
అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. |
30
|
మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. |
31
|
ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు. |
32
|
మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. |
33
|
వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప నుద్దేశించగా |
34
|
సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచిఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను |
35
|
ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి. |
36
|
ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి. |
37
|
వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి. |
38
|
కాబట్టి నేను మీతో చెప్పునదేమనగాఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలో చనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును. |
39
|
దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. |
40
|
వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామ మునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. |
41
|
ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి |
42
|
ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. |
Acts 5:24 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...