1
|
ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను. |
2
|
అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. |
3
|
మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండిమీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి. |
4
|
అందుకు ఫేస్తుపౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ల బోవుచున్నాను |
5
|
గనుక మీలో సమర్థులైనవారు నాతో కూడ వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. |
6
|
అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. |
7
|
పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేక పోయిరి. |
8
|
అందుకు పౌలుయూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. |
9
|
అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెననియెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. |
10
|
అందుకు పౌలుకైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును. |
11
|
నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను. |
12
|
అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను. |
13
|
కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి. |
14
|
వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగాఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు. |
15
|
నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. |
16
|
అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మను |
17
|
కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయ పీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని. |
18
|
నేరము మోపినవారు నిలిచి నప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు. |
19
|
అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను; |
20
|
ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనోయేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింప బడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని. |
21
|
అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించు వరకు నిలిపియుంచవ లెనని ఆజ్ఞాపించితిననెను. |
22
|
అందుకు అగ్రిప్పఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడురేపు వినవచ్చునని చెప్పెను. |
23
|
కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను. |
24
|
అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరువీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయు |
25
|
ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి యున్నాను. |
26
|
ఇతనిగూర్చి మన యేలినవారిపేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించి యున్నాను. |
27
|
ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచు చున్నదని చెప్పెను. |
Acts 25:6 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...