Indian Language Bible Word Collections
1 Timothy 3:16
1 Timothy Chapters
1 Timothy 3 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
1 Timothy Chapters
1 Timothy 3 Verses
1
|
ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. |
2
|
అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి, |
3
|
మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, |
4
|
సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. |
5
|
ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? |
6
|
అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండు నట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. |
7
|
మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను. |
8
|
ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము న పేక్షించువారునైయుండక |
9
|
విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను. |
10
|
మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. |
11
|
అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై3 కొండెములు చెప్పనివారును,4 మితాను భవముగలవారును, అన్ని విషయ ములలో నమ్మకమైనవారునై యుండవలెను. |
12
|
పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను. |
13
|
పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. |
14
|
శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను; |
15
|
అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిర ములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రా¸ |
16
|
నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. |