1
|
జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటి .పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు. |
2
|
మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేల మంది యుండిరి. |
3
|
పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను. |
4
|
రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
5
|
మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
6
|
ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతియై యుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమీ్మజాబాదు ఉండెను. |
7
|
నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
8
|
అయిదవ నెలను ఇశ్రాహే తీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
9
|
ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
10
|
ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
11
|
ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
12
|
తొమి్మదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
13
|
పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
14
|
పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
15
|
పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది. |
16
|
మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను, |
17
|
కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను. |
18
|
దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను, |
19
|
ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను, |
20
|
అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారు డైన యోవేలు అధిపతిగా ఉండెను, |
21
|
గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను, |
22
|
దానీయు లకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. |
23
|
ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు. |
24
|
జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. |
25
|
రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. |
26
|
పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింప బడెను. |
27
|
ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. |
28
|
షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను. |
29
|
షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. |
30
|
ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీ యుడైన యెహెద్యాహును నియమింపబడిరి. |
31
|
గొఱ్ఱల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు. |
32
|
దావీదు పినతండ్రియైన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయై యుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను, హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారులయొద్ద ఉండుటకు నియమింపబడెను. |
33
|
అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. |
34
|
అహీతోపెలు చనిపోయినమీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యా తారును మంత్రులైరి; యోవాబు రాజుయొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. |
1-Chronicles 27:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...