1
|
ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను |
2
|
దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు. |
3
|
యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. |
4
|
మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు. |
5
|
పెరెసు కుమారులు హెస్రోను హామూలు. |
6
|
జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార. |
7
|
కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. |
8
|
ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. |
9
|
హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై. |
10
|
రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. |
11
|
నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను, |
12
|
బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, |
13
|
యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను |
14
|
నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని |
15
|
ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను. |
16
|
సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు. |
17
|
అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. |
18
|
హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను. |
19
|
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను. |
20
|
హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను. |
21
|
తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను. |
22
|
సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను. |
23
|
మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు. |
24
|
కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను. |
25
|
హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా. |
26
|
అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి. |
27
|
యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు. |
28
|
ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు. |
29
|
అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. |
30
|
నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను |
31
|
అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను, |
32
|
షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను. |
33
|
యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు. |
34
|
షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు |
35
|
షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. |
36
|
అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను, |
37
|
జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను, |
38
|
ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను, |
39
|
అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను, |
40
|
ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను, |
41
|
షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను. |
42
|
యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. |
43
|
హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ. |
44
|
షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను. |
45
|
షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి. |
46
|
కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను. |
47
|
యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు. |
48
|
కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను. |
49
|
మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. |
50
|
ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును, |
51
|
బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును. |
52
|
కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు. |
53
|
కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి. |
54
|
శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును. |
55
|
యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు. |
1-Chronicles 2:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...