1
|
ఒక విషాద వర్తమానం. ఇది హద్రాకు యొక్క దేశాన్ని గురించి, అతని రాజధాని నగరమైన దమస్కును గురించిన యెహోవా వర్తమానం. “ెదేవుడిని తెలుసుకున్న వారు కేవలం ఇశ్రాయేలు వంశాల వారు మాత్రమే కాదు. ప్రతి ఒక్కడూ సహాయంకొరకు ఆయనను ఆశ్రయించవచ్చు. |
2
|
హద్రాకు యొక్క దేశ సరిహద్దుల్లో హమాతు ఉంది. అలాగే తూరు, సీదోనులు కూడా ఉన్నాయి. ( ఆ ప్రజలు చాలా తెలివిగల వారు ) |
3
|
తూరు ఒక కోటలా కట్టబడింది. ఆ ప్రజలు వెండిని దుమ్ము వలె విస్తారంగా సేకరించారు. బంగారం వారికి బంకమట్టివలె సామాన్యమై పోయింది. |
4
|
కాని మా ప్రభువైన యెహోవా దానినంతా తీసుకుంటాడు. ఆ నగరపు శక్తివంతమైన నౌకాబలాన్ని ఆయన నాశనం చేస్తాడు. ఆ నగరు అగ్నివల్ల నాశనం కాబడుతుంది! |
5
|
“అష్కెలోను ప్రజలు వాటిని చూసి భయపడతారు. గాజా ప్రజలు భయంతో వణకుతారు. ఇవన్నీ జరగటం చూచినప్పుడు ఎక్రోను ప్రజలకు ఆశలుడుగుతాయి. గాజాలో రాజంటూ ఎవ్వడూ మిగలడు. అష్కెలోనులో ఇక ఎంత మాత్రం ఎవ్వరూ నివ సించరు. |
6
|
అష్డోదులో ప్రజలు వారి నిజమైన తండ్రులు ఎవరో కూడ తెలుసుకోలేరు. గర్విష్టలైన ఫిలిష్తీయులను సర్వనాశను చేస్తాను. |
7
|
రక్తం కలిసివున్న మాంసాన్నిగాని, నిషెధించబడిన ఏ ఇతర ఆహార పదార్థాన్ని గాని వారిక తినరు. జీవించివున్న ఫిలిష్తీయుడెవడై - నా వుంటె అతడు నా ప్రజల్లో భాగంగా ఉంటాడు. యూదాలో వారు మరొక వంశంగా ఉంటారు. యెబూ సీయులవలె ఎక్రోను ప్రజలు నా ప్రజల్లో ఒక భాగమపుతారు. నేను నా దేశాన్ని రక్షిస్తాను. |
8
|
శత్తుసైన్యాలను దానిగుండా వెళ్లనీయను. ఇక ఎంత మాత్రం వారిని నా ప్రజలను బాధించనీయను. గతంలో నా ప్రజలు ఎంత బాధపడ్డారో నేను స్వయంగా చూశాను.” |
9
|
[This verse may not be a part of this translation] |
10
|
రాజు చెపుతున్నాడు, “నేను ఎప్రాయిములో రథాలూ, యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను. యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను. “ శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి. ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు. ఆయన నది నుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు. |
11
|
యెరూషలేమూ, మన ఒడంబడిక రక్తంతో స్థిరపర్చబడింది. కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ ఖాళీ చెరసాలలో ఉండరు. |
12
|
చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి. మీకు ఇంకా ఆశపడదగింది ఉంది. నేను మీవద్దకు తిరిగి వస్తున్నానని నేను మీకు చెపుతున్నాను! |
13
|
యూదా, నిన్ను నేను ఒక విల్లులా విని యోగిస్తాను. ఎఫ్రాయిమూ నిన్ను నేను బాణాల్లా వినియెగిస్తాను. ఇశ్రాయేలూ, గ్రిసుతో యుద్ధం చేయటానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను. |
14
|
యెహోవా వారికి కన్పిస్తాడు. ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు. అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకు పోతుంది. |
15
|
సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు. శత్రువును ఓడించటానికి సైనికులు బండ రాళ్లను, వడిసెలలను ఉపయోగిస్తారు. వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు. అది ద్రాక్షా మద్యంలా పారుతుంది. అది బలిపీఠం మూలలపై పోసిన రక్తంలా వుంటుంది! |
16
|
ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు, దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడతాడు. వారాయనకు చాలా విలువైన వారు. తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటివారు. |
17
|
ప్రతీదీ మెచ్చదగినదై, అందంగా పుంటుంది! విచిత్రమైన పంట పండుతుంది. కాని అది కేవలం ధాన్యం, ద్రాక్షారసం కాదు. ఆ పంట యువతీ యువకులే! |
Zechariah 9:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...