1
|
పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా పద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను. |
2
|
“ నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు. నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీప స్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు ( ప్రమిదెలు ) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నె నుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి. |
3
|
గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమ వైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.” |
4
|
తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “ అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను. |
5
|
“ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్టాడుతూ ఉన్న దేవదూత అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను. |
6
|
అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవా నుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు! |
7
|
ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్ట బడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది! అని ప్రజలు కేకలు పెడతారు.” |
8
|
నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది: |
9
|
“నా ఆలయానికి జెరుబ్బాబెలు వునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు. |
10
|
సామాన్యంగా ప్రారంభించ బడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు దారం తీసికొని తయారైన భవనాన్ని తనిఖీచేసి కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.” |
11
|
పిమ్మట నేను ( జెకర్యా ) అతనికి చెప్పాను: “ దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?” |
12
|
నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాల వద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?” |
13
|
తరువాత దేవదూత నాతో, “ వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?”అని అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను. |
14
|
“ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు. |
Zechariah 4:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...