“నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను. “నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పోడవు వున్నదో చూడాలి”అని అతడు నాకు చెప్పాడు.
అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవ లేనంత పెద్దగా పుంటుందని చెప్పు. అతనికి ఈ విషయూలు చెప్పు: ‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతుపులు నివసిస్తాయి.’
సీయోను ప్రజలారా మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరం నుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నారు.
ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి. కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు. ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది. అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి.
మరియు నేనా ప్రజలను బాధిస్తాను. వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు. బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు. కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను వారు నా ప్రజలకు బానిసలపుతారు. అప్పుడు సర్వశక్తి మంతుడైన యెహోవాయే నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు.
ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు నా వద్దకు వస్తారు. పైగా వారు నా ప్రజలవుతారు. నేను నీ నగరంలో నివసిస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా నీ వద్దకు నన్ను పంపాడని నీవు తెలుసుకుంటావు.