1
|
దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుస్తున్నాడు. ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు. |
2
|
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు? దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు. |
3
|
“అనాధలను, పేద ప్రజలను కాపాడండి. న్యాయం జరగని పేద ప్రజల, అనాదుల హక్కులను కాపాడండి. |
4
|
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి. దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి. |
5
|
“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. వారు గ్రహించరు. వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు. వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.” |
6
|
నేను (దేవుడు) మీతో చెప్పాను, “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు. |
7
|
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు. ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.” |
8
|
దేవా, లెమ్ము నీవే న్యాయమూర్తివిగా ఉండుము! దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే. |
Psalms 82:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...