1
|
యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము. |
2
|
యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము. |
3
|
పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది. నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది. |
4
|
నా బలం పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను. నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను. |
5
|
నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది . |
6
|
అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. శిథిలమైన పాత కట్టడాలలో బతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. |
7
|
నేను నిద్రపోలేను. పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను. |
8
|
నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు. నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు. |
9
|
నా అధిక విచారమే నా భోజనం. నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి. |
10
|
ఎందకంటే, నీవు నా మీద కోపగించావు. యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను కిందకు విసిరేశావు. |
11
|
సాయంకాలమయ్యేసరికి దీర్గమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయి పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను. |
12
|
ఆయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది. |
13
|
నీవు లేచి సీయోనును ఆదరిస్తావు. నీవు సీయోనుయెడల దయగా ఉండే సమయం వస్తూంది. |
14
|
యెరుషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు. |
15
|
జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు. |
16
|
ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు. |
17
|
దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు. |
18
|
రాబోయే తరం వారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసి పెట్టు. అప్పుడు. భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు. |
19
|
యెహోవా పైవున్న తన పవిత్ర స్థానం నుండి కిందకు చూస్తాడు. యెహోవా పరలోకం నుండి కింద భూమిని చూస్తాడు. |
20
|
ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు. మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు. |
21
|
సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబతారు. వారు యెహోవా నామాన్ని యోరూషలేములో స్మరిస్తారు. |
22
|
జనసమూహములు కలిసి పోగుచేయ బడునప్పుడు రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. |
23
|
నాలో బలం పోయింది. నా జీవితం తక్కువగా చేయబడింది. |
24
|
కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు. దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. |
25
|
చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు. ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు. |
26
|
ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి. కానీ నీవు శాశ్వతంగా జీవిస్తావు. అవి బట్టల్లా పాడైపోతాయి. మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చి వేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి. |
27
|
కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు. నీవు శాశ్వతంగా జీవిస్తావు! |
28
|
ఈ వేళ మేము నీ సేవకులము. భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు. మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు. |
Psalms 102:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...