Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Books

Proverbs Chapters

Proverbs 17 Verses

1 ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటినిండా భోజనం ఉండటంకంటె, శాంతి కలిగి భోంచేయటానికి ఒక ఎండిపోయన రొట్టెముక్క ఉంటే చాలు.
2 యజమాని యొక్క సోమరిపోతు కుమారుని మీద తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకొంటాడు.
3 బంగారం, వెండి శుద్ధి చేయబడేందుకు అగ్నిలో వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా.
4 దుర్మార్గులు ఇతరులు చెప్పే దుర్మార్గుపు సంగతులు వింటారు. అబద్ధాలు చెప్పేవారు కూడా అబద్ధాలు వింటారు.
5 కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యలు ఉన్నవాళ్లను చూచి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు.
6 మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు.
7 ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞానముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పటం జ్ఞానముగల పనికాదు.
8 లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు.
9 నీ విషయంలో తప్పు చేసినవాణ్ణి నీవు క్షమిస్తే, మీరు స్నేహితులుగా ఉంటారు. కానీ అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది.
10 తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకొంటాడు. కానీ బుద్ధిహీనుడు నూరు పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు.
11 దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు.
12 ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కానీ తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు.
13 నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి.
14 నీవు వాదం మొదలు పెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి.
15 ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం.
16 బుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే జ్ఞాని అయ్యేందుకు ఆ డబ్బును బుద్ధిహీనుడు ఉపయోగించడు.
17 స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు.
18 మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు.
19 జగడాల్లో ఆనందించేవాడు పాపంలోనూ ఆనందిస్తాడు. నిన్ను గూర్చి నీవు అతిశయిస్తే, నీవు కష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది.
20 దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పే వాడికి కష్టాలు ఉంటాయి.
21 తెలివితక్కువ కుమారుడున్నా తండ్రికి విచారం. బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు.
22 సంతోషం ఒక మంచి మందులాంటిది. కానీ దు:ఖం ఒక రోగంలాంటిది.
23 దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు.
24 జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దాన్ని చేసేందుకే తలుస్తూ ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఎంతసేపూ అందనివాటి కోసం కలగంటూ ఉంటాడు.
25 తెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దు:ఖం కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు.
26 ఏ తప్పు చేయని వానిని శిక్షించటం తప్పు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షించటం తప్పు.
27 జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగిస్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించు కోడు.
28 బుద్ధిహీనుడు కూడా నేమ్మదిగా ఉన్నప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము గలవాడు అని ప్రజలు అనుకొంటారు.
×

Alert

×