“ఇశ్రేయేలీయులతో ఈ విషయాలు చెప్పు: ఒక పురుషుడు గాని స్త్రీగాని కొన్నాళ్ల పాటు ఒకరినుండి ఒకరు ప్రత్యేకంగా ఉండాలని కోరవచ్చును. ఈ ప్రత్యేకించు కోవటంలో ఉద్దేశం, అతడు ఆ వ్యవధిలో తనను తాను సంపూర్ణంగా యెహోవాకు అర్పించుకోవటమే. అతడు నాజీరు అని పిలువబడతాడు.
ఆ కాలంలో అతడు ద్రాక్షామద్యంగాని ఇంకే మత్తు పానీయంగాని తాగకూడదు. ద్రాక్షారసంనుండి తీయబడిన చిరకను గాని ఇంకే మప్త సానీయంగాని అతడు తాగకూడదు. ద్రాక్షాపండ్లుగాని, ఎండిన ద్రాక్షాలుగాని అతడు తినకూడదు, ద్రాక్షారసం తాగకూడదు.
“అలా వేరుగా ఉండే కాలంలో అతడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అతడు వేరుగా ఉండాల్సిన రోజులు గడచిపోయేంతవరకు అతడు పవిత్రంగా ఉండాలి. అతడు తన వెంట్రుకలను పొడవుగా పెరగనివ్వాలి. అతడు దేవునికి చేసిన వాగ్దానంలో అతని తల వెంట్రుకలు ఒక భాగం. ఆ వెంట్రుకలను ఒక కానుకగా అతడు దేవునికి ఇస్తాడు. అందుచేత వేరుగా ఉండే సమయం అయిపోయేంత వరకు అతడు తన తల వెంట్రుకలను పొడవుగా పెంచాలి.
అతని సొంత తండ్రి లేక తల్లి, సోదరుడు లేక సోదరి చనిపోయినా సరే అతడు వారిని తాకగూడదు. అలా తాకితే అతడు అపవిత్రుడవుతాడు. అతడు ప్రత్యేకించుకొన్నట్టు, పూర్తిగా యెహోవాకు అర్పించు కొన్నట్టు అతడు చూపెట్టుకోవాలి.
నాజీరు మరొకనితో ఉన్నప్పుడు, ఆ మరొకడు అకస్మాత్తుగా మరణించవచ్చును. చనిపోయినవానిని నాజీరు ముట్టినట్టయితే నాజీరు అపవిత్రుడవుతాడు. ఇలా జరిగినట్లయితే నాజీరు తన తల వెంట్రుకలను తీసివేయాలి. (ఆ వెంట్రుకలు అతని ప్రమాణంలో ఒక భాగం.) ఏడో రోజున అతడు తన వెంట్రుకలను తీసివేయాలి. ఎందుచేతనంటే ఆ రోజునే అతడు శుద్ధి చయబడ్డాడు.
అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలిగా ఒకదాన్ని అర్పిస్తాడు. రెండో దానిని దహన బలిగా అతడు అర్పిస్తాడు. ఈ దహనబలి ఆ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. (అతడు శవం దగ్గర ఉండటమే అతని పాపం.) అతడు తన తలవెంట్రుకలను దేవునికి ఇస్తానని ఆ సమయంలో మరల ప్రమాణం చేయాలి.
అనగా అతడు మరల ప్రత్యేకంగా ఉండేందుకు తనను యెహోవాకు అర్పించుకోవాలని దీని అర్థం. ఒక సంవత్సరం వయసు గల ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకురావాలి. అపరాధ పరిహారార్థ బలిగా అతడు దీనిని ఇవ్వాలి. అతడు ప్రత్యేకంగా ఉన్న రోజులన్నీ మరచిపోవటం జరిగింది. అతడు మరల ప్రత్యేకంగా ఉండటం ప్రారంభించాలి. అతడు మొదటిసారి ప్రత్యేకంగా ఉన్నప్పుడు శవాన్ని ముట్టినందువల్ల ఇలా చేయాలి.
అక్కడ తన అర్పణను అతడు యెహోవాకు ఇవ్వాలి. అతని అర్పణ ఏమిటంటే: దహనబలి కోసం ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండకూడదు.) పాప పరిహారార్థబలి కోసం ఒక్క సంవత్సరపు ఆడ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండ కూడదు.) సమాధాన బలికోసం ఒక్క మగ గొర్రె (ఈ గొర్రెకు ఎలాంటి లోపం ఉండ కూడదు.)
రొట్టెలబుట్టను యాజకుడు యెహోవాకు అర్పిస్తాడు. తర్వాత యెహోవాకు సమాధానబలిగా మగ గొర్రెను అతడు వధిస్తాడు. ధాన్యార్పణ, పానార్పణాలతో అతడు దానిని యెహోవాకు అర్పిస్తాడు.
“సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గరకు వాజీరు వెళ్లాలి. యెహోవాకోసం అతడు పెంచిన తలవెంట్రుకలను అక్కడ అతడు తీసివేయాలి. సమాధాన బలియాగం క్రింద మండుతున్న మంటల్లో ఆ వెంట్రుకలు వేయబడుతాయి.
“నాజీరు తన తల వెంట్రుకలు తీసివేసిన తర్వాత, ఉడికిన మగ గొర్రె జబ్బను, గంపలో నుండి పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, రెండు రొట్టెలను యాజకుడు అతనికి ఇస్తాడు. ఈ రెండు రొట్టెలు పులియని పిండితో చేయబడినవి.
అప్పుడు యాజకుడు వీటిని యెహోవా ముందర అల్లాడిస్తాడు. ఇది నైవేద్యము. ఇవి పవిత్రమైనవి, యాజకునికి చెందుతాయి. మరియు మగ గొర్రె బోర, తొడ యెహోవా ముందర అల్లాడించబడుతాయి. ఇవికూడా యాజకునికి చెందుతాయి. ఆ తర్వాత నాజీరు ద్రాక్షారసం తాగవచ్చును.
“ఒక వ్యక్తి నాజీరుగా ప్రత్యేకించబడాలని నిర్ణయించుకొంటే, అప్పుడు అతడు ఈ కానుకలన్నీ యెహోవాకు అర్పించాలి. నాజీరు ప్రయాణానికి సంబంధించిన చట్టం అది. అయితే ఒక వ్యక్తి ఇంతకంటె చాల ఎక్కువే యెహోవాకి ఇవ్వగలిగి ఉండొచ్చు. అలాంటివాడు ఎక్కువ చేస్తానని వాగ్దనంచేస్తే, అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అది కూడ నాజీరు వాగ్దానపు చట్టమే.”