1
|
మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: |
2
|
“ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు. |
3
|
దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది. |
4
|
అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది. |
5
|
అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది. |
6
|
మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. |
7
|
మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.) |
8
|
హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది. |
9
|
తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు. |
10
|
మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది. |
11
|
షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) పక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది. |
12
|
తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.” |
13
|
కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి. |
14
|
రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు. |
15
|
ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.” |
16
|
అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: |
17
|
“దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు |
18
|
అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు. |
19
|
ఆ నాయకుల పేర్లు ఇవి: యూదా వంశంనుండి - యెపున్నె కుమారుడు కాలేబు; |
20
|
షిమ్యోను వంశంనుండి - అమ్మిహూదు కుమారుడు షెమూయేలు; |
21
|
బెన్యామీను వంశంనుండి - కిస్లోను కుమారుడు ఎలీదాదు |
22
|
దాను వంశంనుండి - యొగ్లి కుమారుడు బుక్కి |
23
|
మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి ఏఫోదు కుమారుడు హన్నీయేలు |
24
|
ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి - షిఫ్తాను కుమారుడు కెమూయేలు |
25
|
జెబూలూను వంశంనుండి - పర్నాకు కుమారుడు ఎలీషాపాను |
26
|
ఇశ్శాఖారు వంశంనుండి - అజ్ఞాను కుమారుడు పల్తీయేలు |
27
|
ఆషేరు వంశంనుండి - షెలోమి కుమారుడు అహీహోదు |
28
|
నఫ్తాలి వంశంనుండి - అమ్మీహోదు కుమారుడు పెదహేలు.” |
29
|
ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు. |
Numbers 34:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...