కనుక మోషే ప్రజలతో మాట్లాడాడు. అతడు వారితో ఇలా చెప్పాడు: “మీ మనుష్యుల్లో కొందిరిని సైనికులుగా ఏర్పరచుకోండి. మిద్యానీయుల విషయం తేల్చేందుకు వారిని యెహోవా వాడుకొంటాడు.
ఆ 12,000 మందిని మోషే యుద్ధానికి పంపించాడు. యాజకుడైన ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసును వారితో అతడు పంపాడు. పవిత్ర వస్తువుల్ని, కొమ్ములను, బూరలను ఎలీయాజరు తనతో తీసుకుని వెళ్లాడు.
మోషే, యాజకుడైన ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయేలీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీయులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నదికి తూర్పున ఉంది.
ఈ స్త్రీలు ఇశ్రాయేలు పురుషులకు తగరు. యెహోవానుండి ప్రజలు తిరిగి పోతారు. అది బిలాము కాలంలాగే ఉంటుంది. బయలు పెయోరు దగ్గర జరిగినట్టే జరుగుతుంది. ఆ రోగం యెహోవా ప్రజలకు మళ్లీ వస్తుంది.
ఇప్పుడు మిద్యానీ బాలురను అందరినీ చంపివేయండి. పురుషునితో కాపురం చేసిన ప్రతి మిద్యానీ స్త్రీని చంపివేయండి. పురుష సంయోగం ఎరిగిన మిద్యానీ స్త్రీలలో ప్రతి ఒక్కరినీ చంపేయండి.
తర్వాత, ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసానికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని ముట్టినాసేరే నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి.
ఏడో రోజున మళ్లీ మీరు అలాగే చేయాలి. మీ బట్టలు అన్నీ మీరు ఉదుక్కోవాలి. తోలు, ఉన్ని, కట్టెతో చేయబడిన వాటిని అన్నింటినీ మీరు కడగాలి. మీరు తప్పక పవిత్రం కావాలి.”
(22-23) అయితే అగ్నిలో వెయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి.
యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం తీసుకో. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నింటిలోను ఇలాగే.
ఆ తర్వాత ప్రజల సగభాగంలో ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం లేవీయులకు ఇవ్వవలెను. (ఎందుచేతనంటే యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు తీసుకొన్నారు గనుక.)”
ప్రతి 50 లోంచి ఒకటి యెహోవాకోసం మోషే తీసుకున్నాడు. జంతువులు, మనుష్యుల్లో కూడ ఇలాగే. అప్పుడు అతడు వాటిని లేవీయులకు ఇచ్చాడు. ఎందుచేతనంటే వారు యెహోవా పవిత్ర గుడారం విషయమై బాధ్యత వహించారు గనుక. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇలా చేసాడు.
కనుక ప్రతి సైనికుని దగ్గర్నుండీ యెహోవా కానుకను మేము తెస్తున్నాము. బంగారంతో చేయబడిన దండపతకాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు మేము తెస్తున్నాము. మా పాపాలను కప్పేందుకు ఇది యెహోవాకు కానుక.”
1,000 మందిపైనున్న, 100 మందిపైనున్న అధికారుల దగ్గర బంగారాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరూ తీసుకున్నారు. తర్వాత ఆ బంగారాన్ని సన్నిధి గుడారంలో వారు ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఎదుట ఈ కానుక ఒక జ్ఞాపక చిహ్నం.