Indian Language Bible Word Collections
Numbers 29:10
Numbers Chapters
Numbers 29 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Numbers Chapters
Numbers 29 Verses
1
“ఏడో నెల మొదటి రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. అది బూర ఊదే రోజు.
2
దహనబలులను మీరు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
3
కోడె దూడతో బాటు తూములో మూడు పదోవంతుల మంచి పిండి నూనెతో కలిపినది, పొట్టేలుకు రెండు పదోవంతులును,
4
ఏడు గర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి.
5
మరియు పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను అర్పించండి.
6
నెలపొడుపు [*నెలపొడుపు యూదుల నెలలో మొదటి దినం. ఇది ప్రత్యేక ఆరాధనా దినం.] బలులు, దాని ధాన్యార్పణం గాక బలులు అర్పించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యార్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల ప్రకారం జరగాలి. అని అగ్నిలో దహించబడాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
7
“ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. ఏ పనీ మీరు చేయకూడదు.
8
దహనబలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము కాని ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రె పిల్లలను మీరు అర్పించాలి.
9
ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండితూములో మూడు పదోవంతులు ఒక కోడె దూడతోను, రెండు పదోవంతులు పొట్టేలుతోను,
10
ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కోదానిలో పదోవంతును మీరు అర్పించాలి.
11
ఒక పోతు మేకను కూడ పాపపరిహారార్థ బలిగా మీరు అర్పించాలి. ప్రాయశ్చిత్త దినపు పాపపరిహారార్థ బలి అర్పణకు ఇది అదనం. ప్రతిదినం బలి, దాని ధాన్యార్పణం, పానార్పణలకు ఇది అదనం.
12
“ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజులుగా మీరు జరుపుకోవాలి.
13
దహన బలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు 14 మీరు అర్పించాలి.
14
పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు పదోవంతులు, రెండు పొట్టేళ్లలో ఒక్కోదానితో రెండు పదోవంతులు,
15
పదునాలుగు గొర్రెపిల్లల్లో ఒక్కోదానితో ఒక్కో పదోవంతు మీరు అర్పించాలి.
16
ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
17
“ఈ పండుగ రెండోనాడు 12 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
18
కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ కూడ మీరు అర్పించాలి.
19
పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను కూడా మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
20
“ఈ పండుగ మూడోనాడు 11 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
21
కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రె పిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
22
పాపపరిహారార్థ బలిగా ఒక మగమేకను మీరు అర్పించాలి. రోజువారి బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
23
“ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
24
కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
25
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
26
“ఈ పండుగ ఐదో రోజున 9 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
27
కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ మీరు అర్పించాలి.
28
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ సానార్పణకు ఇది అదనం.
29
“ఈ పండుగ ఆరోనాడు 8 కోడె దూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
30
కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
31
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
32
“ఈ పండుగ ఏడోనాడు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
33
కోడె దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
34
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినం బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
35
“ఈ పండుగ ఎనిమిదో రోజు మీకు చాల ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.
36
మీరు ఒక దహనబలి అర్పించాలి. అది హోమార్పణ. యెహోవాకు ఇష్టమైన సువాసన. ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, పుష్టిగల ఏడాది గొర్రెపిల్లలు ఏడింటిని మీరు అర్పించాలి.
37
కోడెదూడకు, పొట్టేలుకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
38
పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినము ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
39
“ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.”
40
యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు.