1
|
నేను కలత చెందాను! ఎందుకంటే, నేను సేకరించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను. పండిపోయినా ద్రాక్షాపండ్లవలె ఉన్నాను. తినటానికి ద్రాక్షాపండ్లు మిగలలేదు. నేను కాంక్షించే తొలి అంజూరపు పండ్లులేనేలేవు. |
2
|
అనగా విశ్వసంగల జనులంతా పోయారు. ఈ దేశంలో మంచివాళ్లంటూ ఎవ్వరూ మిగలలేదు. ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటానికి వేచివున్నాడు. ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటో పాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు. |
3
|
ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు. అధిపతులు లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు. “ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు. |
4
|
వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు. వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్లుపొదకంటే చాలా కంటకుడై ఉంటాడు. నీ ప్రవక్తలు ఈ రోజు వస్తుందని చెప్పారు. నీ కావలివాండ్ర దినం రానేవచ్చింది. ఇప్పుడు నీవు శిక్షింపబడతావు! ఇప్పుడు నీవు కలవరపడతావు! |
5
|
నీ పొరుగువానిని నమ్మవద్దు! స్నేహితుని నమ్మువద్దు! నీ భార్యతో సహితం నీవు స్వేచ్చగా మాట్లాడవద్దు! |
6
|
తన ఇంటివారే తనకు శత్రువులవుతారు. ఒక కుమారుడు తన తండ్రిని గౌరవించడు. ఒక కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది. ఒక కోడలు తన అత్తపై తిరుగుబడుతుంది. |
7
|
కావున సహాయంకొరుకు నేను యెహోవా తట్టు చూస్తాను. నాకు సహాయం చేయటానికి నేను యెహోవా కొరకు నిరీక్షిస్తాను. నా దేవుడు నా మొర ఆలకిస్తాడు. |
8
|
నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువూ, నన్ను చూచి నవ్వకు! నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ యెహోవాయే నాకు వెలుగు. |
9
|
[This verse may not be a part of this translation] |
10
|
నా శత్రువు ఇది చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నుడిగింది. ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టమీద నడిచి నట్లు జనులు ఆమెమీద నడుస్తారు. |
11
|
నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది. ఆ సమయంలో వారి దేశం విస్తరిస్తుంది. |
12
|
నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు. అష్షూరునుండి, ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు. నీ దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు నదివరకు, పడమట సముద్రంనుండి తూర్పున పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది. |
13
|
దేశం పాడై పోయింది. దానిలో నివసించే జనులవల్ల, వారు చేసిన పనులవల్ల అది పాడై పోయింది. |
14
|
కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు. నీకు చెందిన ప్రజా సమూహాన్ని పాలించు. ఆ మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు, పర్వతం మీదనూ ఒంటరిగానూ ఉంటుంది. గతంలో మాదిరి ఆ మంద బాషానులోనూ, గిలాదులోనూ నివసిస్తుంది. |
15
|
నేను నిన్ను ఈజిప్టు నుండిబయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరిపించాను. ఆ రకంగా మీరింకా ఎన్నో అద్భుత కార్యాలు చూసేలా చేస్తాను. |
16
|
అన్య జనులు ఆ అద్భుతకార్యాలు చూసి సిగ్గుపడతారు. వారి “శక్తి” నాదానితో పోల్చినప్పుడు వ్యర్థమైనదని వారు గ్రహిస్తారు. వారు విస్మయం చెంది, వారి నోళ్లపై చేతులు వేసుకుంటారు! వారు చెవులు మూసుకొని, వినటానికి నిరాకరిస్తారు. |
17
|
వారు పాములా మట్టిలో పాకుతారు. వారు భయంతో వణుకుతారు. తమ బొరియల్లోనుంచి బయటకు వచ్చే కీటకాలవలె, వారు నేలమీద పాకుతారు. వారు భయపడి దేవుడైన యెహోవా వద్దకు వస్తారు. నీ ముందు వారు భయపడతారు! |
18
|
నీవంటి దేవుడు మరొకడు లేడు. పాపం చేసిన దోషులను నీవు క్షమిస్తావు. నీ ప్రజలలో మిగిలిన వారి పాపాల వైపు నీవు చూడవు. దేవుడైన యెహోవా కోపం శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ఆయన కనికరం చూపటానికి ఇష్టపడతాడు. |
19
|
యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను పరిహరించు. మా పాపాలన్నిటినీ లోతైన సముద్రంలోకి విసిరివేయుము. |
20
|
దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా ఉంటావు. అబ్రాహాము యెడల దయకలిగి యుంటావు. ఎందుకంటే మా పూర్వీకులకు పురాతన కాలమందు నీవు వాగ్దానం చేశావు. |
Micah 7:20 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...