1
|
[This verse may not be a part of this translation] |
2
|
ప్రజాలారా, మీరంతా వినండి! భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి! నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయం నుండి వస్తాడు. నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు. |
3
|
చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు. ఆయన భూమీయొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు. |
4
|
దేవుడైన యెహోవా అగ్ని ముందు మైనంలా పర్వతాలు కరిగిపోతాయి. గొప్ప జలాపాతంలా, లోయలు వికలమై కరిగిపోతాయి. |
5
|
యాకోబు పాపం కారణంగా, ఇశ్రాయేలు ఇంటి వారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది. యాకోబు పాపానికి కారణం ఏమిటి? దానికి కారణం సమరయ! యూదాలో ఉన్నత స్థలమేది? అది యెరూషలేము! |
6
|
మైదానంలో రాళ్ల గుట్టలా నేను సమరయను మార్చుతాను. అది ద్రాక్షాతోట వేయటానికి అనువైన భూమివలె మారిపోతుంది. సమరయ యొక్క నిర్మాణపు రాళ్లను పెరిగి లోయలో పారవేస్తాను. నేను దాని పునాదులను నాశనం చేస్తాను. |
7
|
దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగ గొట్టబడతాయి. అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది. దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది. కావున ఈ వస్తువులన్నీ నాపట్ల అవిశ్వసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి. |
8
|
ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను. నేను పాద రక్షలు కూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను. నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను. నిప్పు కోళ్లలా మూల్గుతాను. |
9
|
ఎందుకనగా సమరయ గాయం మాన్పరానిది. ఆమె గాయం (పాపం) యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల నగర ద్వార వద్దకు చేరింది. అది చివరకు యెరూషలేము వరకు వచ్చింది. |
10
|
ఇది గాతులో చెప్పవద్దు. అక్కడ ఏడ్వవద్దు. బేత్యఫ్రలో విలపించి, దుమ్ములో పొర్లాడు. |
11
|
షాఫీరులో నివసించేవాడు, దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పోమ్ము. జయనానులో నివసించేవాడు బయటకు వెళ్లడు. బేతేజెలులో ఉన్నావారు విలపిస్తారు. దానికి కావలసిన ఆసరా మీ నుండి తీసుకొంటుంది. |
12
|
మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం ఎదురు చూస్తూ నీరసించిపోయాడు. ఎందుకంటే యెహోవానుండి ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది. |
13
|
లాకీషులో నివసిస్తున్న ఓ స్త్రీ, రథాన్ని వేగముగల గుర్రానికి తగిలించు. సీయోను పాపాలు లాకీషులో మొదలైనాయి. ఎందుకంటే నీవు ఇశ్రాయేలు పాపాలనే అనుసరించావు. |
14
|
కావున గాతులోని మోరెషెతుకు మీరువీడ్కోలు బహుమతులు ఇవ్వాలి. అక్జీబులోని ఇండ్లు ఇశ్రాయేలు రాజులను మోసపుచ్చుతాయి. |
15
|
మారేషా నివాసులారా, మీ మీదికి నేనోక వ్యక్తిని తీసుకొని వస్తాను, మీకున్న వస్తువులన్నీ ఆ వ్యక్తి తీసుకుంటాడు. ఇశ్రాయేలు మహిమ (దేవుడు) అదుల్లాములో ప్రవేశిస్తుంది. |
16
|
కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకుమీరు దుఃఖిస్తారు. రాబందులారా మీ తలలు బోడి చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు. |
Micah 1:5 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...