వాళ్ళతో, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్యలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి.
అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము’ [*ప్రభువుకు … పంపుతాము కొన్ని గ్రీకు ప్రతులలో ‘ప్రభువుకు కావాలి. అది ఆయనకు అవసరమైయున్నది’ అని ఉంది.] అని సమాధానం చెప్పండి” అని అన్నాడు.
ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు, “ ‘హోసన్నా, [†హోసన్నా అంటే, ‘రక్షించు’ అని అర్థం. కాని దాని అర్థం ‘జయంగా’ మారిపోయింది.] ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు ధన్యుడు.’ కీర్తన. 118:25-26]
యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి [‡ఆలయము యెరూషలేములో ఉన్న ఆలయం. ప్రపంచంలో ఉన్న యూదులందరికి ఇది ఒక్కటే ఆలయం.] వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల పన్నెండుగురితో కలిసి బేతనియకు వెళ్ళాడు.
కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు.
అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు. (మత్తయి 21:12–17; లూకా 19:45–48; యోహాను 2:13–22)
యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు.
ఆయన బోధిస్తూ, “ ‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు. [✡ఉల్లేఖము: యెషయా 56:7.] కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు” [✡ఉల్లేఖము: యిర్మీయా 7:11.] అని అన్నాడు.
(మత్తయి 21:23-27; లూకా 20:1-8) యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు.