1
|
పొంతి పిలాతు పాలిస్తూ ఉన్నాడు. హేరోదు గలిలయ దేశానికి సామంతరాజుగా ఉన్నాడు. హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు. లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా ఉన్నాడు. |
2
|
ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా కుమారుడైన యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది. |
3
|
ఆతర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్ని తిరిగి, ‘పాప క్షమాపణ పొందాలంటే మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలి’ అని బోధించాడు. |
4
|
దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది: “ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంతములో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది. |
5
|
లోయలు పూడ్చివేయ బడుతాయి. కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి. వంకర బాటలు చక్కగా ఔతాయి. కరుకు బాటలు నునుపుగా ఔతాయి. |
6
|
మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!” యెషయా 40;3-5 |
7
|
ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు? |
8
|
మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. |
9
|
చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు. |
10
|
“మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు. |
11
|
యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు. |
12
|
పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు. |
13
|
“ెసేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు. |
14
|
కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు. అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు. |
15
|
ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయిఉండవచ్చనుకున్నారు. |
16
|
యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. |
17
|
చేట ఆయన చేతిలో ఉంది. ఆయనాచేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు. |
18
|
యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు. |
19
|
రాజ్యాధికారి హేరోదుకు అతని సోదరుని భార్య అయిన హేరోదియతో సంబంధంవుంది. దీని కారణంగా, హేరోదు చేసిన యితర దుష్కార్యాల కారణంగా యోహాను అతణ్ణి తీవ్రంగా విమర్శించాడు. |
20
|
తద్వారా హేరోదు, యోహానును కారాగారంలో ఉంచాడు. ఇలా చేసి తాను చేసిన దుష్కార్యాలకు మరొక దుష్కార్యం చేర్చుకొన్నాడు. |
21
|
యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. |
22
|
పవిత్రాత్మ ఒక పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. వెంటనే పరలోకం నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీయందు ఎక్కువగా నేను ఆనందించుచున్నాను” అని వినబడింది. |
23
|
యేసు బోధించటం మొదలు పెట్టినప్పుడు ఆయనకు సుమారు ముప్పై సంవత్సరాలు. యేసు యోసేపు కుమారుడు అని ప్రజలు అనుకునేవాళ్ళు. యోసేపు హేలీ కుమారుడు, |
24
|
హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు. లేవి మెల్కీ కుమారుడు. మెల్కీ యన్న కుమారుడు. యన్న యోసేపు కుమారుడు. |
25
|
యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు. ఆమోసు నాహోము కుమారుడు, నాహోము ఎస్లి కుమారుడు. ఎస్లి నగ్గయి కుమారుడు. |
26
|
నగ్గయి మయతు కుమారుడు. మయతు మత్తతీయ కుమారుడు. మత్తతీయ సిమియ కుమారుడు. సిమియ యోశేఖు కుమారుడు. యోశేఖు యోదా కుమారుడు. |
27
|
యోదా యోహన్న కుమారుడు. యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబేలు కుమారుడు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు. షయల్తీయేలు నేరి కుమారుడు, |
28
|
నేరి మెల్కీ కుమారుడు, మెల్కీ అద్ది కుమారుడు. అద్ది కోసాము కుమారుడు, కోసాము ఎల్మదాము కుమారుడు, ఎల్మదాము ఏరు కుమారుడు, |
29
|
ఏరు యెహోషువ కుమారుడు. యెహోషువ ఎలీయెజెరు కుమారుడు. ఎలీయెజెరు యోరీము కుమారుడు. యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు. |
30
|
లేవి షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. యోసేపు యోనాము కుమారుడు. యోనాము ఎల్యాకీము కుమారుడు, |
31
|
ఎల్యాకీము మెలెయా కుమారుడు. మెలెయా మెన్నా కుమారుడు. మెన్నా మత్తతా కుమారుడు. మత్తతా నాతాను కుమారుడు. నాతాను దావీదు కుమారుడు, |
32
|
దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు, |
33
|
నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు. అమ్మీనాదాబు అరాము కుమారుడు. అరాము ఎస్రోము కుమారుడు, ఎస్రోము పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు. |
34
|
యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు, |
35
|
నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు, |
36
|
షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు, |
37
|
లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు, |
38
|
కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు కుమారుడు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు. యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై |
Luke 3:17 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...