1
|
[This verse may not be a part of this translation] |
2
|
[This verse may not be a part of this translation] |
3
|
“యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉపదేశాన్ని చేసావు. బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు. |
4
|
తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి. బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు. |
5
|
కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు. కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు! |
6
|
నీవు దేవున్ని ఆరాధిస్తూ ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు. కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి. నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక. |
7
|
“యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు నిర్దోషియైన మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం చేయబడలేదు. మంచి మనుష్యులు ఎన్నడూ నాశనం చేయబడలేదు. |
8
|
కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను. వారికి కూడా అవే సంభవిస్తాయి. |
9
|
దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది. దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది. |
10
|
దుర్మార్గులు సింహాలవలె గర్జించి గుర్రు పెడతారు. కాని దేవుడు దుర్మార్దులను నోరు మూయిస్తాడు. మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు. |
11
|
దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు. వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు.” |
12
|
“రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది. ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి. |
13
|
రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా అది నా నిద్రను భంగం చేసింది. |
14
|
నేను భయపడి వణకిపోయాను. నా ఎముకలన్నీ వణకిపోయాయి! ఎలీఫజు మాట్లాడుతున్నాడు |
15
|
ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా నా శరీరం మీది వెంట్రుకలు వేగంగా చలించాయి! |
16
|
ఆత్మ ఇంకా నిలిచి ఉంది. కాని అదేమిటో నేను చూడలేకపోయాను. ఒక ఆకారం నా కళ్ల ఎదుట నిలిచింది. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పడం విన్నాను. |
17
|
‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు. మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు. |
18
|
దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు. తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు |
19
|
కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి ఎక్కవ తప్పులు పట్టుకోగలడు. మనుష్యులు మట్టి ఇండ్లలో నివసిస్తారు. ఈ మట్టి ఇండ్లవునాదులు మట్టిలో ఉన్నాయి. వారు చిమ్మెట కంటే తేలికగా చాపగొట్టబడతారు. |
20
|
సూర్వోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మనుష్యులు మరణిస్త్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు. వారు శాశ్వతంగా నశించిపోతారు. |
21
|
వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి, ఈ మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.’ |
Job 4:5 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...