1
|
అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు జవాబు ఇచ్చాడు. దేవుడు చెప్పాడు: |
2
|
“నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన, తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే ఈ మనిషి ఎవరు?” |
3
|
యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు. నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగాఉండు. |
4
|
యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు. |
5
|
యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు? నీకు తెలిసినట్టే ఉంది! కొల బద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు. |
6
|
భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి? భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు? |
7
|
అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసిపాడాయి. దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు. |
8
|
“యోబూ, భూమి అగాధములో నుండి సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు? |
9
|
ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను. మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను. |
10
|
సముద్రానికి హద్దులు నేనే నియమించాను. మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను. |
11
|
నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు. నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను. |
12
|
“యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో నీవు ఎప్పుడైనా చెప్పావా? |
13
|
యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని, దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా? |
14
|
ఉదయపు వెలుగు కొండలు, లోయలు కనబడేటట్టు చేస్తుంది. పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి. అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా ఆ స్థలాలు ఆకారాలు రూపొందు తాయి. |
15
|
దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది. |
16
|
“యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా? మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా? |
17
|
యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా? |
18
|
యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా? ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు. |
19
|
“యోబూ, వెలుగు వచ్చే దిశగా పోయేందుకు ఎటు వెళ్లాలి? చీకటి ఎక్కడ నుండి వస్తుంది? |
20
|
యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా? అవి నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా? |
21
|
యోబూ, నీవు చాలా ముసలివాడిని కదా? భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ? |
22
|
యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ ఉంచే గిడ్డంగులకు నీవు ఎప్పుడైనా వెళ్లావా? |
23
|
కష్టదినాల్లో ఉపయోగించేందుకు యుద్ధాన్ని, పోరాట దినాలకు ఉపయోగించేందుకు హిమమును, వడగండ్లను నేను దాచిపెడతాను. |
24
|
యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పైకి వస్తాడో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? భూమి అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడనుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? |
25
|
యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు? ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు? |
26
|
యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట నీళ్లు ఉండునట్లు. |
27
|
బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి, ఈ సంగతులను చేసిన వారు ఎవరు? |
28
|
యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి? |
29
|
యోబూ, హిమమునకు తల్లి ఎవరు? ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు? |
30
|
జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి? |
31
|
“యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? మృగశీర్షకు కట్లు నీవు విప్పగలవా? |
32
|
యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్టు నీవు చేయగలవా? లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా? |
33
|
యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా? భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా? |
34
|
యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా? |
35
|
యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా? మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’ అని అంటాయా? |
36
|
ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు? మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు? |
37
|
యోబూ, మేఘాలను లెక్కించుటకు, అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు? |
38
|
ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది. ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి. |
39
|
“యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా? ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా? |
40
|
అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో పండుకొని లేక కూర్చొని ఉంటాయి. |
41
|
యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు కాకులను పోషించేది ఎవరు? |
Job 38:32 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...