English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Jeremiah Chapters

Jeremiah 52 Verses

1 యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరా వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా. [*యిర్మీయా ఇతడు ప్రవక్తయైన యిర్మీయా కాడు. అదే పేరుగల మరో వ్యక్తి.] హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు.
2 రాజైన యెహోయాకీము మాదిరిగానే సిద్కియా కూడా దుష్ట కార్యాలు చేశాడు. సిద్కియా ఆ చెడు కార్యాలు చేయటం యెహోవాకు ఇష్టం లేదు.
3 వారి పట్ల యెహోవా కోపగించటంతో యెరూషలేములోను, యూదాలోను భయంకరమైన సంఘటనలు జరిగాయి. చివరికి యెరూషలేము, యూదా ప్రజలను తన ముందు నుంచి దూరంగా తోసివేశాడు. బబులోను రాజుమీద సిద్కియా తిరుగుబాటు చేశాడు.
4 కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవత్సరాల పది నెలలు దాటి పదవ రోజు [†తొమ్మిది … రోజు అనగా క్రీ. పూ. 588 సంవత్సరం, జనవరి నెల.] గడుస్తూ వుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తన యెరూషలేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సైన్యం యెరూషలేము బయట దిగింది. తరువాత వారు నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ దిమ్మలు కట్టారు.
5 రాజైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం [‡పదకొండవ సంవత్సరం ఇది క్రీ.పూ. 587 సంవత్సరం.] జరిగే వరకు యెరూషలేము నగరం బబులోను సైన్యం ముట్టడిలో వుంది.
6 ఆ సంవత్సరం నాల్గవ నెలలో తొమ్మిదవ రోజున నగరంలో కరువు తీవ్రమయ్యింది. నగరంలో ఆహార పదార్ధాలు అయిపోవటం కారణంగా ప్రజలకు తినటానికి తిండి కరువయ్యింది.
7 ఆ రోజున బబులోను సైన్యం యెరూషలేములోనికి ప్రవేశించింది. యెరూషలేము సైన్యం పారిపోయింది. రాత్రి సమయంలో సైనికులు నగరం వదిలి పారిపోయారు. రెండు గోడల మధ్య ద్వారం గుండా వారు బయటకి పోయారు. ఆ ద్వారం రాజు యొక్క ఉద్యానవనం వద్ద వుంది. బబులోను సైన్యం నగరాన్ని చుట్టుముట్టి ఉన్నప్పటికీ, యెరూషలేము సైనికులు పారిపోగలిగారు. వారు ఎడారివైపు పారిపోయారు.
8 కాని, కల్దీయుల సైన్యం రాజైన సిద్కియాను వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. కాని సిద్కియా సైనికులంతా పారిపోయారు.
9 బబులోను సైన్యం రాజైన సిద్కియాను చెరబట్టింది రిబ్లా నగరంలోవున్న బబలోను రాజు వద్దకు అతన్ని తీసికొని వెళ్లారు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. బబులోను రాజు రిబ్లా నగరంలో రాజైన సిద్కియాపై తీర్పు ప్రకటించాడు.
10 రిబ్లా నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను చంపివేశాడు. తన కుమారులు క్రూరంగా చంపబడటం సిద్కియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడటానికి అతనిపై వత్తిడి వచ్చింది.) యూదా అధికారులందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు.
11 పిమ్మట బబులోను రాజు సిద్కియా కండ్లు పెరికివేశాడు. అతనికి కంచు గొలుసులు వేశాడు. తరువాత సిద్కియాను అతడు బబులోనుకు తీసికొనిపోయాడు. బబులోనులో సిద్కియాను అతడు చెరసాలలో ఉంచాడు. సిద్కియా చనిపోయే వరకు చెరసాలలోనే ఉన్నాడు.
12 బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధి పతియైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. రాజైన నెబుకద్నెజరు పాలనలో పందొమ్మిదవ సంవత్సర [§నెబుకద్నెజరు … సంవత్సరం అనగా క్రీ. పూ. 587 సంవత్సరం.] ఐదవనెలలో పదవ రోజున అతను వచ్చాడు. బబులోనులో నెబూజరదాను ఒక ముఖ్యమైన నాయకుడు.
13 నెబూజరదాను దేవాలయాన్ని తగులబెట్టాడు. రాజభవనాన్ని, యెరూషలేములో ఇతర గృహాలను కూడ అతడు తగులబెట్టాడు. యెరూషలేములో ప్రతి ముఖ్య భవనాన్నీ అతడు తగులబెట్టాడు.
14 కల్దీయుల సైన్యమంతా కలిసి యెరూషలేము చుట్టూవున్న గోడలను కూలగొట్టింది. రాజుయొక్క ఒక ప్రత్యేక అంగరక్షకుని కింద ఆ సైన్యం ఉంది.
15 సైనికాధికారి నెబూజరదాను ఇంకా యెరూషలేములో మిగిలిన జవాన్ని బందీలుగా పట్టుకున్నాడు. [*యెరూషలేములో … పట్టుకున్నాడు ఇది ప్రాచీన గ్రీకు అనువాదంనుండి తీసికొనబడింది. కొంతమంది మిక్కిలి పేదవారిని అని ఈ వాక్యానికి ముందు వున్నది. బందీలుగా అని పొరపాటున తరువాత వచనంనుండి చూసి వ్రాసియుండవచ్చు.] బబులోను రాజుకు ఇంతకుముందే లొంగిపోయిన వారిని కూడా చెరబట్టి తీసికొనిపోయాడు. యెరూషలేములో మిగిలిన నిపుణులైన చేతి పనివారిని కూడా అతడు తీసికొని వెళ్లాడు.
16 కాని నెబూజరదాను మిక్కిలి పేదవారిని కొందరిని రాజ్యంలో వదిలివేశాడు. వారిని ద్రాక్ష తోటలలోను, పొలాలలోను పవిచేయటానికి అతడు వదలి వెళ్లాడు.
17 ల్దీయుల సైన్యం ఆలయంలోని కంచు స్తంభాలను విరుగగొట్టింది. యెహోవాయొక్క ఆలయంలో గల స్తంభాలను, కంచు సముద్రమును (కోనేరు) కూడ ముక్కలు చేశారు. [†కంచు … చేశారు బబులోను సైన్యం దేవాలయం లోనుండి వస్తు సామగ్రిని తీసికొని పోయారు. వివరాలకు మొదటి రాజుల గ్రంథం 13-26 చూడండి.] ఆ కంచునంతా వారు బబులోనుకు తీసికొని పోయారు.
18 బబులోను సైన్యం ఆలయం నుండి ఆ వస్తు సామగ్రిని కూడ తీసికొని పోయింది: కుండలు, పారవంటి గరిటెలు, వత్తులను ఎగదోసే పనిముట్లు, పెద్ద గిన్నెలు, పెనాలు, దేవాలయ అర్చనలో ఉపయెగించే కంచు సామగ్రి వంటి వాటిని కూడ బబులోను సైన్యం తీసికొనిపోయింది.
19 రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి ఈ వస్తువులు తీసుకొని వెళ్లాడు: పళ్లెములు, ధూపకలశాలు, పెద్ద పాత్రలు, కుండలు, దీపస్తంభాలు, పెనములు, పానీయాలు అర్పించే పాత్రలు వెండి, బంగారాలతో చేసిన వస్తువులన్నీ అతడు తీసికొని పోయాడు.
20 రెండు స్తంభాలు, సముద్రం (కోనేరు), దాని కింద పన్నెండు కంచు గిత్తదూడల విగ్రహాలు, తోపుడు స్థంభాలు చాలా బరువైనవి. రాజైన సొలొమోను వాటిని యెహోవా ఆలయానికి చేయించాడు. వాటి చేతకు పట్టిన కంచు ఎంత బరువైనదంటే దాన్ని తూచటం కష్టం.
21 ప్రతి కంచుస్తంభం ఇరువది ఏడు అడుగుల (పదునెనిమిది మూరలు) ఎత్తు వుంది. ప్రతి స్తంభం పద్దెనిమిది అడుగుల (పన్నెండు మూరలు) చుట్టు కొలత కలిగివుంది. ప్రతి స్తంభం బోలుగా ఉంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు.
22 మొదటి స్తంభం మీది కంచుపీట ఏడున్నర అడుగుల (ఏడు మూరలు) ఎత్తు కలిగి ఉంది. దాని చుట్టూ వలలాంటి నగిషీ పని, కంచు దానిమ్మకాయల అలంకరణ చేయబడింది. మరొక స్తంభం మీద కూడ దానిమ్మకాయల పనితనం వుంది. అదికూడ మొదటి స్తంభం మాదిరిగానే వుంది.
23 స్తంభాల పక్కల మీద తొంబది ఆరు దానిమ్మకాయలున్నాయి. స్తంభాల పైన వలవంటి నగిషీపని మీద మొత్తం వంద దానిమ్మ కాయలు వున్నాయి.
24 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి శెరాయాను, సిద్కియాను బందీలుగా తీసికొని పోయాడు. ముగ్గురు ద్వారపాలకులను కూడా బందీలుగా తీసికొనిపోయాడు. శెరాయా ప్రధాన యాజకుడు, అతని తరువాతి వాడు జెఫన్యా.
25 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి పోరాటయోధుల దళాధిపతిని కూడా పట్టుకున్నాడు. రాజుయొక్క సలహాదారులలో ఏడుగురిని కూడా అతడు పట్టుకున్నాడు. ఆ మనుష్యులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. సైన్యంలో మనుష్యులను చేర్చుకొనే అధికారిని (లేఖరి) కూడ అతడు పట్టుకున్నాడు. నగరంలో ఉన్న అరువది మంది సామాన్య ప్రజలను కూడా అతడు పట్టుకున్నాడు.
26 (26-27) అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను ఆ అధికారులందరినీ పట్టుకున్నాడు. వారిని బబులోను రాజు వద్దకు తీసికొనివచ్చాడు. బబులోను రాజు రిబ్లా నగరంలో ఉన్నాడు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. రిబ్లా నగరంలో ఆ అధికారులందరికీ రాజు మరణశిక్ష విధించాడు. ఆ విధంగా యూదా ప్రజలు తమ దేశంనుండి తీసికొనిపోబడ్డారు.
28 నెబుకద్నెజరు చెరబట్టిన వారు వివరాలు ఇలా ఉన్నాయి: నెబుకద్నెజరు పాలన ఏడవ సంవత్సరం [‡నెబుకద్నెజరు … 7వ సంవత్సరం. అనగా క్రీ. పూ. 598 సంవత్సరం మధ్యనుండి 597 సంవత్సరం మధ్య కాలం.] గడుస్తూ వుండగా మూడు వేల ఇరవై ముగ్గురు యూదా ప్రజలు.
29 నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరం [§నెబుకద్నెజరు … 18వ సంవత్సరం. ఇది క్రీ.పూ. 588 సంవత్సరపు మధ్యకాలం 587 కాలం] జరుగుతూ ఉండగా ఎనిమిది వందల ముప్పది రెండు మంది యెరూషలేము నుండి బందీలుగా తీసికొని పోబడ్డారు.
30 నెబుకద్నెజరు పాలన ఇరువై మూడవ సంవత్సరంలో [*నెబుకద్నెజరు … 23వ సంవత్సరం. ఇది క్రీ. పూ. 582వ సంవత్సరం మధ్యనుండి 581వ సంవత్సరం మధ్యవరకు.] నెబూజరదాను ఏడువందల నలభై ఐదు మంది యూదా వారిని బందీ చేశాడు. నెబూజరదాను రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక ధళాధిపతి. మొత్తం మీద నాలుగువేల ఆరువందల మందిని బందీలుగా పట్టుకుపోయారు.
31 యూదా రాజైన యెహోయాకీను బబులోనులో ముప్పది ఏడు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. యెహోయాకీను కారాగారవాసంలో ముప్పది ఏడవ సంవత్సరం [†కారాగారవాసంలో 37వ సంవత్సరం. ఇది క్రీ. పూ. 561 సంవత్సరం.] జరుగుతూ ఉండగా బబులోను రాజైన ఎవీల్మెరోదకు అతని పట్ల మిక్కిలి కనికరం చూపాడు. ఆ సంవత్సరంలో యెహోయాకీనును అతడు చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మెరోదకు బబులోనుకు రాజు అయిన మొదటి సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు.
32 ఎవీల్మెరోదకు మిక్కిలి దయగా యెహోయాకీనుతో మాట్లాడాడు. అప్పుడు తనతో బబులోనులో ఉన్న రాజులం దరికంటె యెహోయాకీనుకు అతడు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాడు.
33 దానితో యెహోయాకీను తన చెరసాల బట్టలు తీసివేశాడు. మిగిలిన తన జీవిత కాలమంతా అతడు ప్రతిరోజూ రాజుయొక్క బల్లవద్దనే భోజనం చేశాడు.
34 బబులోను రాజు ప్రతిరోజూ యెహోయాకీనుకు దినభత్యం ఇచ్చేవాడు. ఇది యెహోయాకీను చనిపోయేవరకు కొనసాగింది.
×

Alert

×