అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్న వాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ద కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే,
నా ప్రియమైన సోదరులారా! ప్రపంచ దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించిన వాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమె వాగ్దానం చేసాడు.
“నీ పొరుగింటి వాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు” [✡ఉల్లేఖము: లేవీ. 19:18.] అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే.
ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు” [✡ఉల్లేఖము: నిర్గమ. 20:14; దిత్వీ. 5:18.] అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా!
కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!”అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను.
మన పూర్వీకుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా?
“అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు” [✡ఉల్లేఖము: ఆది. 15:6.] అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు.