యెహోవా ఎదుట ఆయన ఒక చిన్న మొక్కవలె ఉన్నాడు. ఎండిన భూమిలో ఎదుగుతున్న మొక్కవలె పెరిగాడు. మనము ఆయనలో చూడతగిన రూపముగాని తేజస్సుగాని, ఏమి లేదు. మనం ఆయనని చూడటానికి ఇష్టపడుటకు ఆయనలో ప్రత్యేకత ఏమీ మనకు కనబడదు.
ఆయన నీచంగా ఎంచబడ్డాడు, మనుష్యుల చేత విడిచి పెట్టబడ్డాడు, ఆయన ఎంతో బాధ పొందిన మనిషి. రోగం బాగా ఎరిగిన వాడు. కనీసం ఆయన్ని కన్నెత్తి చూసేందుకు మనుష్యులు ముఖాన్ని దాచుకొన్నారు. ఆయన నీచంగా ఎంచబడ్డాడు. కనుక మనం ఆయన్ని లెక్కచేయలేదు.
కాని మనం చేసిన చెడ్డ పనులకు ఆయన శ్రమపొందాల్సి వచ్చింది. మన దోషం మూలంగానే ఆయన నలుగగొట్టబడ్డాడు. మనకు సమాధాన మిచ్చిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన గాయాల మూలంగా మనకు స్వస్థత కలిగింది.
ఆయన భాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు, కానీ ఎన్నడూ ఎదురు చెప్పలేదు. వధించబడుటకు తీసుకొని పొబడే గొర్రెవలె ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా ఉన్నాడు. తనను తాను రక్షించుకోవటానికి ఆయన నోరు తెరవలేదు.
ఆయన అబద్ధపు తీర్పుపొంది, బంధించబడి తీసుకొని పోబడ్డాడు. ఆయన తరంలో ఈ విషయాలు ఎవరు మనస్సుకు తీసుకొన్నారు? ఆయన భూమిమీద నివసిస్తున్న వారిలో నుండి తొలగించబడ్డాడు. నా ప్రజల అపరాధాల కోసం ఆయన నలుగ కొట్టబడ్డాడు.
ఈ కారణం చేత నేను గొప్ప ప్రజలతో ఆయన్ని గొప్పవాడినిగా చేస్తాను. బలముగల ప్రజలందరిలో ఆయనకు అన్నింటిలోనూ భాగం ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల కోసం ఆయన తన ప్రాణం ఇచ్చిమరణించాడు. ఆయన నేరస్థులలో ఒకనిగా లెక్కించబడ్డాడు. అనేకుల పాపాల్ని ఆయన మోసి అపరాదుల కోసం విజ్ఞాపన చేసాడు.