1
|
మేలుకో! మేలుకో! సీయోనూ మేలుకో. నీవు వస్త్రాలు ధరించు. నీ బలంతొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో! దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు , పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు. |
2
|
ధూళి దులిపివేయి! అద్భుతమైన నీ వస్త్రాలు ధరించు! సీయోను కుమారీ, యెరూషలేమా, నీవు ఒక ఖైదీవి. కాని ఇప్పుడు నీ మెడ చుట్టూ ఉన్న గొలుసుల నుండి నిన్ను నీవు విడుదల చేసుకో! |
3
|
యెహోవా చెబతున్నాడు, “నీవు డబ్బుకు అమ్మబడలేదు. అందుచేత డబ్బు లేకుండనే నీవు రక్షించబడతావు.” |
4
|
నా ప్రభువు యెహోవా చెబతున్నాడు: “నా ప్రజలు నివాసం ఉండేందుకు మొదట ఈజిప్టుకు దిగిపోయారు, ఆ తర్వాత వారు బానిసలయ్యారు. ఆ తర్వాత వారిని అష్షూరు బానిసలను చేసింది. |
5
|
ఇప్పుడు చూడండి ఏమయిందో! మరో రాజ్యాం నా ప్రజలను తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న ఆ రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు ఈ రాజ్యం ఏమీ చెల్లించలేదు. ఈ రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, వారిని చూచి నవ్వుతుంది. ఆ మనుష్యులు ఎప్పుడూ నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.” |
6
|
“నా ప్రజలు నన్ను గూర్చి నేర్చుకొనేందుకు ఇది జరిగింది. నేను ఎవరినో నా ప్రజలు తెలుసుకొంటారు. నా ప్రజలు నా పేరు తెలుసుకొంటారు, ఉన్నవాడను అనే నేను వారితో మాట్లాడుతున్నానని వారు తెలుసుకొంటారు” అని యెహోవా చెబుతున్నాడు. |
7
|
శుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!”అని ఒక వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం. |
8
|
పట్టణపు కావలి వాళ్లు కేకలు వేయటం మొదలు పెట్టారు. వాళ్లంతా కలిసి ఆనందిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా సీయోనుకు తిరిగి రావటం వారిలో ప్రతి ఒక్కరూ చూస్తారు. |
9
|
యెరూషలేమా, నాశనం చేయబడిన నీ కట్టడాలు మరల సంతోషిస్తాయి. మీరంతా కలిసి ఆనందిస్తారు. ఎందుకంటే, యెరూషలేముమీద యెహోవా దయగలిగి ఉంటాడు. యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు. |
10
|
యెహోవా తన పవిత్ర శక్తిని సకల రాజ్యాలకు చూపిస్తాడు. మరియు దేవుడు తన ప్రజలను ఎలా రక్షిస్తాడో అది దూర దేశాలన్నీ చూస్తాయి. |
11
|
ప్రజలారా మీరు బబులోను విడిచిపెట్టాలి. ఆ స్థలం విడిచిపెట్టండి! ఆరాధనలో ఉపయెగించే వస్తువలను మోసే మనుష్యులారా మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. అపవిత్రమైన దేన్ని ముట్టుకో వద్దు. |
12
|
మీరు బబులోను విడిచిపెడ్తారు. కానీ మీరు ఆత్రంగా విడిచిపెట్టేందుకు బలవంతం చేయబడరు. పారిపోయేందుకు మీరు బలవంతం చేయబడరు. మీరు బయటకు నడుస్తారు మరియు యెహోవా మీతో నడుస్తాడు. యెహోవా మీకు ముందు ఉంటాడు. ఇశ్రాయేలీయుల దేవుడు మీ వెనుక ఉంటాడు . |
13
|
“నా సేవకుని చూడు. అతనికి విజయం కలుగుతుంది. అతడు చాలా ప్రముఖుడవుతాడు. భవిష్యత్తులో ప్రజలు అతన్ని సన్మానించి, గౌరవిస్తారు. |
14
|
“కానీ చాలా మంది మనుష్యులు నా సేవకుని చూచి అదరిపోయారు. అతణ్ణి ఒక మనిషిగా వారు గుర్తించలేనంతగా అతడు బాధించబడ్డాడు. |
15
|
కానీ అంతకంటె ఎక్కువమంది ప్రజలు ఆశ్చర్యపోతారు. రాజులు అతన్ని చూచి ఆశ్చర్యపోయి, నోట మాట రాకుండా ఉండిపోతారు. నా సేవకుని గూర్చిన కథ వారు వినలేదు- జరిగింది వారు చూశారు. ఈ ప్రజలు ఆ కథ వినలేదు గాని వారు గ్రహించారు.” |
Isaiah 52:9 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...