అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు. అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు అది ధూళితో పడిపోతుంది.
మంచి వాళ్లను నిజాయితీయే జీవన విధానం మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు. మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు.
నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది. ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది. దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు.
చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే వాడు మంచి చేయటం నేర్చుకోడు. చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు. ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు.
కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే వారు దానిని చూస్తారు. యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు. అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడ తారు. నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో మేము ఇతర ప్రభువులను అనుసరించాం. మేము ఇతర యజమానులకు చెందిన వాళ్లం కానీ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు. మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.
కాని యెహోవా చెప్పేదేమంటే, “నీ ప్రజలు మరణించారు కానీ వారు మళ్లీ లేస్తారు నా ప్రజల శరీరాలు మరణం నుండి లేస్తాయి. భూమిలోని మృతులు లేచి, సంతోషిస్తారు. నిన్ను కప్పియున్న మంచు, ఒక కొత్త రోజు వెలుతురులా ఉంది. ఒక కొత్త కాలం వస్తోందని అది సూచిస్తుంది ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.” తీర్పు: బహుమానం లేక శిక్ష
యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు. ప్రపంచంలోని మనుష్యులు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది భూమి ఇక ఎన్నటికీ చని పోయిన వాళ్లను కప్పెట్టదు