English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Hosea Chapters

Hosea 9 Verses

1 ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు.
2 కానీ ఆ కళ్లములనుండి వచ్చే ధాన్యం, ఇశ్రాయేలీయులకు సరిపడినంత ఆహారం ఇవ్వదు. ఇశ్రాయేలుకు సరిపడినంత ద్రాక్షారసం ఉండదు.
3 ఇశ్రాయేలీయులు యెహోవా దేశంలో నివసించరు. ఎఫ్రాయిము తిరిగి ఈజిప్టుకు వెళ్తుంది. వారు తినకూడని ఆహారం వారు అష్షూరులో తింటారు.
4 ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారము వద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు-అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి.
5 వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు.
6 ఇశ్రాయేలీయులకు కలిగినదంతా శత్రువు తీసుకొన్నందువల్ల ఇశ్రాయేలు వదిలిపెట్టబడింది. కాని ఈజిప్టు ఆ ప్రజలను తీసుకొంటుంది. వారిని మెంఫెసు పట్టణం పాతిపెడ్తుంది. వారి వెండి ఐశ్వర్యాల మీద పిచ్చిమొక్కలు మొలుస్తాయి. ఇశ్రాయేలీయులు నివసించినచోట ముళ్లకంపలు పెరుగుతాయి.
7 “ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో; శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు ప్రతిఫలం నీవు చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చేపుతున్నాడు.
8 దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కానీ మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించు కొంటున్నారు.
9 గిబియా కాలంలో వలె, ఇశ్రాయేలీయులు నాశనం లోనికి లోతుగా దిగిపోయారు. ఇశ్రాయేలీయుల పాపాలను యెహోవా జ్ఞాపకం ఉంచుకొంటాడు. వారి పాపాలను ఆయన శిక్షిస్తాడు.
10 ”“నా మట్టు కైతే ఇశ్రాయేలు ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు-వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు.
11 “ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టుకలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు.
12 కానీ ఒకవేళ ఇశ్రాయేలీయులు పిల్లలను పెంచినా, అది సహాయ పడదు. పిల్లలను వారి దగ్గర్నుండి నేను తీసివేస్తాను. నేను వారిని విడిచిపెట్టేస్తాను. వారికి కష్టాలు తప్ప మరేవి ఉండవు.”
13 ఎఫ్రాయిము తన పిల్లలను బోను లోనికి నడిపిస్తూ ఉండటం నేను చూడగలను. ఎఫ్రాయిము తన పిల్లలను హంతకుని దగ్గరకు తీసికొని వస్తాడు.
14 యెహోవా, నీ ఇష్టం వచ్చిన దాన్ని వారికి చేయుము. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇమ్ము, పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇమ్ము.
15 వారి దుర్మార్గం అంతా గిల్గాలులో ఉంది. అక్కడే నేను వారిని అసహ్యించుకోవటం మొదలు బెట్టాను. వారు చేసే దుర్మార్గపు పనుల మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల గొట్టేస్తాను. ఇంకెంతమాత్రం నేను వారిని ప్రేమించను. వారి నాయకులు తిరుగుబాటు దారులు. వారు నాకు విరోధంగా తిరిగారు.
16 ఎఫ్రాయిము శిక్షించబడుతుంది. వారి వేరుచస్తుంది. వారికి ఇక పిల్లలు ఉండరు. వారు పిల్లల్ని కనవచ్చును. కానీ వారి శరీరాలనుండి పుట్టే ఆ ప్రశస్త శిశువులను నేను చంపేస్తాను.
17 ఆ ప్రజలు నా దేవుని మాట వినలేదు. కనుక ఆయన వారిని నిరాకరించాడు. వారు ఇల్లులేని వారుగా, రాజ్యాలలో సంచారం చేస్తారు.
×

Alert

×