నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరిమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము, “మా పాపాన్ని తీసివేయుము. మా మంచి పనులను అంగీకరించుము. మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధ గుర్రాల పైన స్వారీ చేయుము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.”
“ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు. నీ ప్రార్థనలు ఆలకించేది నేనే నిన్ను కాపాడేది నేనే. నేను నిరంతరం పచ్చగానుండే మీ ఫలము నానుండి వస్తుంది.”
వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు. చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి. యెహోవా మార్గాలు సరైనవి. మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు. పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.