ఇప్పుడు షయల్తీయేలు కుమారుడు, యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలుతోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషవాతోను, మరియు జనులం దరితోను మాట్లాడి ఇలా చెప్పు:
“ఈ ఆలయం యొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీరు దీనిని ఎలా చూస్తున్నారు? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?
కాని ఇవ్పుడు యెహోవా చెపుతున్నాడు, ‘జెరుబ్బాబెలూ! అధైర్యపడవద్దు. ‘యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకడునైన యెహోషవా! ‘అధైర్యపడవద్దు. ఈ దేశనివాసులైన మీరందరు అధైర్యపడవద్దు’ అని యెహోవా చెపుతున్నాడు. ‘ఈ పనిని కొనసాగించండి,ఎందు కంటే, నేను మీతో ఉన్నాను.’ సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ విషయాలు చెప్పాడు!”
దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆలయాన్ని మహిమతో నింపుతాను. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు.
“ఒకడు తన వస్త్రముల మడతలో పవిత్ర బలి మాంసాన్ని పెట్టుకుని వెళ్లినాడనుకో. పవిత్ర మాంసాన్ని ఉంచిన తన వస్త్రం రొట్టెనుగాని, వండిన ఆహారాన్నిగాని, ద్రాక్షారసం, నూనె లేక ఇతర తినుబండారాలను తాకినదనుకో. అలా ముట్టబడిన పదార్థం పవిత్రమౌతుందా?” యాజకులు “కాదు” అని సమాధానమిచ్చారు.
పిమ్మట హగ్గయి అన్నాడు: “ ఒకడు శవాన్ని ముట్టినాడనుకో. అతడు అపవిత్రుడవుతాడు. అతడు గనుక దేన్నయినా ముట్టుకుంటే ఆ వస్తువు అపవిత్ర మౌతుందా?” “ అది అపవిత్రమౌతుంది” అని యాజకులు సమాధానమిచ్చారు.
పిమ్మట హగ్గయి చెప్పాడు: “ దేవుడైన యెహోవా ఇలా చెవుతున్నాడు: ‘ ఈ జనులకు సంబంధించినంత వరకూ ఆ విషయం కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరి శుద్ధమైనవి.
ప్రజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో ఉంది. ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే దొరికేవి.
ఎందుకంటే నేను మిమ్మల్ని, మీ చేతులు చేసిన వస్తువులను శిక్షించాను. మొక్కలను చీడలతోను, బూజుతోనూ, మిమ్మల్ని వడగండ్లతోను శిక్షించాను. కాని మీరింకా నా వద్దకు రారు. ‘ దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. “
సర్వశక్తి మంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు: ‘షయల్తీయేలు కుమారుడవు, నా సేవకుడైన జెరుబ్బాబెలూ, నిన్ను నేను ఎన్నుకొన్నాను. దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ఆ సమయాన నేను నిన్నొక ముద్ర వేసే ఉంగరంగా చేస్తాను. (ఈ పనులు నేను చేశానని మీరే ఋజువు.)” సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు.