Indian Language Bible Word Collections
Genesis 10:18
Genesis Chapters
Genesis 10 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Genesis Chapters
Genesis 10 Verses
1
నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
2
యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
3
గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా
4
యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
5
మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివశించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతుల వారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.
6
హాము కుమారులు కూషు, మిస్రాయిము, [*మిస్రాయిము ఇది ఈజిప్టు యొక్క మరో పేరు.] పూతు, కనాను.
7
కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా. రాయమా కుమారులు షేబ, దదాను.
8
కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు.
9
నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి నిమ్రోదు వలె యెహోవా యెదుట గొప్ప వేటగాడు” అంటారు.
10
షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది.
11
నిమ్రోదు అష్షూరు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె రహోబో, తీరు, కాలహు,
12
రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు మహా పట్టణానికి మధ్య రెసెను ఉంది.)
13
లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, సఫ్తుహీయులు.
14
సత్రుసీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారే.)
15
సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను, హేతుకు కనాను తండ్రి.
16
యెబూసీయులు, అమోరీయులు, గీర్గాషీయులు.
17
హివ్వీయులు, అర్కీయులు, సినీయులు.
18
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికి కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి.
19
ఉత్తరాన సీదోను నుండి దక్షీణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొర్రా, అద్మా. సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.
20
ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారికి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయు. వారు వేరు వేరు జాతులయ్యారు.
21
యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.
22
షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23
అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరుమాష.
24
అర్పక్షదు షేలహుకు తండ్రి. షేలహు ఏబెరుకు తండ్రి.
25
ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు [†పెలెగు అనగా విభజన] అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.
26
యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
27
హదోరము, ఊజాలు, దిక్లాను
28
ఓబాలు, అబీమాయెలు, షేబ,
29
ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు.
30
మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.
31
వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.
32
నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.