1
|
యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం ఆలపించాడు: యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు! |
2
|
[This verse may not be a part of this translation] |
3
|
[This verse may not be a part of this translation] |
4
|
యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును! |
5
|
మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి. అవి నన్ను బెదరగొట్టాయి! |
6
|
సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు మాయలో చిక్కుకున్నాను! |
7
|
నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. అవును, నేను నా దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా ఆక్రందన ఆయన చెవులను చేరింది. |
8
|
భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన! |
9
|
ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలువడ్డాయి. |
10
|
ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు! ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు! |
11
|
యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు! |
12
|
యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు. |
13
|
ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది! |
14
|
యెహోవా ఆకాశంలో గర్జించాడు ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు! |
15
|
యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు |
16
|
అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి! |
17
|
యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు; |
18
|
నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు! |
19
|
నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు! |
20
|
నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు; |
21
|
యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు పాపం చేయక పరిశుద్ధంగా వున్నాయి! |
22
|
అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను! |
23
|
యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను. |
24
|
దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి దూరంగా ఉంటాను! |
25
|
అందువల్లనే యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును. ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను. |
26
|
నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు! ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు! |
27
|
ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే, నీవు కూడ అతని పట్ల సద్భావం చూపిస్తావు! కాని ఎవరైనా నీకు ప్రతికూలంగా వుంటే, నీవు కూడ ప్రతికూలుడవై వుంటావు! |
28
|
ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు! |
29
|
యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు. యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు. |
30
|
మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను! |
31
|
దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు. |
32
|
యెహోవాను మించిన దేవుడు లేడు; మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు. |
33
|
దేవుడు నా రక్షణ దుర్గం; సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు! |
34
|
జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు. |
35
|
దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు. నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు. |
36
|
డాలువలె నీవు నన్ను రక్షిస్తావు! నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది! |
37
|
నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. |
38
|
నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను; |
39
|
నేను నా శత్రువులను నాశనం చేశాను, నేను వారిని పూర్తిగా సంహరించాను! వారు మరల తలయెత్తే అవకాశం లేదు! అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను! |
40
|
ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు. నీవే నా శత్రువులను ఓడించినావు. |
41
|
నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను! |
42
|
నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి! |
43
|
నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని నా పాదములతో అణగ దొక్కాను. |
44
|
నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నీవు నన్ను కాపాడావు! నన్ను రాజ్యాలకు అధిపతిగా చేశావు; నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు! |
45
|
ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు. |
46
|
అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు! |
47
|
యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి! ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి! అయన నన్ను కాపాడే కొండ; |
48
|
నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన; |
49
|
నా శత్రువుల నుండి నన్ను విముక్తి చేయువాడు ఆయనే! అవును, నా శత్రువులకు మిన్నగా నన్ను ఉన్నతుని చేశావు! నన్ను గాయపర్చనుద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు. |
50
|
యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను! |
51
|
ఆయన నియమించిన రాజుకు దిగ్విజయం కలిగేలా యెహోవా సహాయపడతాడు; ఆయన అభిషిక్తము చేసిన రాజైన దావీదుకు, అతని సంతతికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను పంచి ఇస్తాడు! |
2-Samuel 22:24 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...