English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

2 Samuel Chapters

2 Samuel 16 Verses

1 ఒలీవల పర్వతం మీద దావీదు కొంతవరకు వెళ్లాడు. అక్కడ మెఫీబోషెతు సేవకుడైన సీబా దావీదును కలిశాడు. సీబా వెంట గంతలు కట్టిన రెండు గాడిదలున్నాయి. గాడిదల మీద రెండు వందల రొట్టెలు, ఒక వంద ఎండు ద్రాక్షాగుత్తులు, ఒక వంద అంజూరపు పండ్లు, ఒక ద్రాక్షారసపు తిత్తివున్నాయి.
2 రాజు (దావీదు) సీబాతో, “ఇవన్నీ ఎందుకు?” అని అన్నాడు. “ఈ గాడిదలు రాజకుటుంబంవారు ఎక్కటానికి. ఈ రొట్టెలు, పండ్లు సేవకులు తినటానికి. ఎడారిలో ఎవరైనా అలసిపోతే ఈ ద్రాక్షారసం తాగి సేద తీర్చుకోవచ్చు” అని సీబా అన్నాడు.
3 “మెఫీబోషెతు [*మెఫీబోషెతు “నీ యజమాని మనుమడు” అని పాఠాంతరం.] ఎక్కడ? అని రాజు అడిగాడు. “మెఫీబోషెతు యెరూషలేములోనే వుంటున్నాడు. ఎందువల్లనంటే ఈ రోజు ఇశ్రాయేలీయులు తన తాత [†తాత “తండ్రి” అని పాఠాంతరం.] ! రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చి వేస్తారని ఆశిస్తూవున్నాడు!” అని రాజుకు సీబా సమాధానం చెప్పాడు.
4 “సరే, మంచిది. మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నేను నీకు ఇస్తాను” అని రాజు సీబాతో చెప్పాడు. అది విని సీబా, “మీకు నేను సమస్కరిస్తున్నాను. మీకు నేనిలా సదా సంతృప్తిని చేకూర్చగలనని ఆశిస్తున్నాను” అని అన్నాడు.
5 దావీదు బహూరీముకు వచ్చాడు. బహూరీమునుండి సౌలు కుటుంబానికి చెందిన వాడొకడు బయటికి వచ్చాడు. వాని పేరు షిమీ. అతను గెరా అనువాని కుమారుడు. దావీదును గురించి చెడు మాటలు మాట్లాడుతూ వాడు బయటికి వచ్చాడు. అతడలా పదే పదే నిందిస్తూ వచ్చాడు.
6 దావీదు మీదికి, అతని సేవకుల మీదికి రాళ్లు విసరటం మొదలు పెట్టాడు. కాని దావీదుతో వున్న మనుష్యులు, సైనికులు దావీదు చుట్టూ చేరారు. చూట్టూ చేరి రక్షణ కల్పించారు.
7 షిమీ దావీదును తిట్టాడు. “బయటికి పో! బయటికి పో! నీవు మంచివాడవు కావు. హంతకుడవు!” [‡హంతకుడవు రక్తదాహంగలవాడవని పాఠాంతరం.] అంటూ తిట్టాడు.
8 “యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువలననగా నీవు సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన సౌలు స్థానాన్ని నీవు సంగ్రహించావు! [§సంగ్రహించావు “తీసుకున్నావని” శబ్ధార్థం.] కాని యెహోవా ఇప్పుడు రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా నీవొక హంతకుడవు!”
9 సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి షిమీ తల నరికివేయనీయండి!” అని అన్నాడు.
10 అందుకు రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా నేనేమి చేయగలను! నిజానికి షిమీ నన్ను దూషిస్తున్నాడు! కాని యెహోవా వాని చేత నన్ను శపిస్తున్నాడు!”
11 దావీదు తన సేవకులతోను, అబీషైతోను ఇంకా ఈ విధంగా అన్నాడు, “చూడండి, నా స్వంత కుమారుడే నన్ను చంపజూస్తున్నాడు! బెన్యామీనీయుడైన ఈ మనుష్యుడు (షిమీ) నన్ను చంపటానికి ఇంకా ఎక్కువ హక్కు కలిగి వున్నాడు! అతనిని అలా వదిలి వేయండి. నన్ను గురించి చెడ్డ మాటలు వానిని చెప్పనీయండి. యెహోవాయే ఇవన్నీ వానిచేత పలికిస్తున్నాడు.
12 బహుశః యెహోవా నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా గమనిస్తూ వుండవచ్చు. బహుశః యెహోవాయే నాకు మేలు చేయవచ్చు. ఈ రోజు షిమీ చెప్పే చెడ్డ మాటలన్నిటికీ భిన్నంగా ఏదో ఒక మంచి నాకు జరుగువచ్చు!”
13 కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన దారిన వెళ్లిపోయాడు. కాని షిమీ దావీదును అనుసరిస్తూనే ఉన్నాడు. కొండ పక్కగా దారికి ఆవలివైపున నడుస్తూ ఉన్నాడు. దారి పోడవునా షిమీ దావీదును దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే వున్నాడు.
14 రాజైన దావీదు, అతని అనుచరులు బహూరీము అను చోటికి చేరారు. వారంతా బాగా అలసిపోయారు. వారు బహూరీము వద్ద విశ్రమించారు.
15 అబ్షాలోము, అహీతోపెలు, తదితర ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వచ్చారు.
16 అర్కీయుడు, దావీదు స్నేహితుడు అయిన హూషై అబ్షాలోము వద్దకు వచ్చి “రాజు వర్ధిల్లు గాక! రాజు వర్ధిల్లుగాక!” అని అన్నాడు.
17 “నీ స్నేహితుడు దావీదుపట్ల నీవు ఎందుకు రాజభక్తి కలిగియుండలేదు? నీ స్నేహితునితో కలిసి యెరూషలేమును విడిచి ఎందుకు పోలేదు?” అని అబ్షాలోము అడిగాడు.
18 హూషై ఇలా అన్నాడు: “యెహోవా ఎవరిని ఎన్నుకుంటాడో నేను ఆయన మనిషిని. ఈ మనుష్యులు, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎంపికచేశారు. నేను నీతోనేవుంటాను.
19 గతంలో నేను నీ తండ్రికి సేవచేశాను. సరే, ఇప్పుడు నేను ఎవరికి సేవ చేయాలి? దావీదు కుమారునికి! అందువల్ల నేను నీకు సేవ చేస్తాను.”
20 “దయచేసి ఇప్పుడు మనం ఏమి చేయాలో చెప్పు” అని అబ్షాలోము అహీతోపెలును అడిగాడు.
21 అబ్షాలోముతో అహీతోపెలు ఇలా అన్నాడు: “నీ తండ్రి తన యొక్క దాసీలను కొంత మందిని ఇల్లు చూస్తూ ఉండమని వదిలి వెళ్లాడు. నీవు వెళ్లి వారితో సాంగత్యము చేయము. దానితో ఇశ్రాయేలీయులందరూ నీ తండ్రి నిన్నసహ్యించు కుంటున్నాడని వింటారు. అప్పుడు నీకు మద్దతు యివ్వటానికి నీ ప్రజలందరికీ తగిన ప్రోత్సాహం దొరుకుతుంది.”
22 తరువాత అబ్షాలోము కొరకు మిద్దె మీద ఒకడేరా వేశారు. అక్కడ తన తండ్రి దాసీలతో అబ్షాలోము సంగమించాడు. ఇశ్రాయేలీయులంతా ఇది చూశారు.
23 ఆ కాలంలో అహీతోపెలు సలహా దావీదు, అబ్షాలోము లిరువురూ చాలా ముఖ్యమైనదిగా భావించేవారు. ఒక వ్యక్తికి దేవుని మాట ఎంత ముఖ్యమో, అహీతోపెలు సలహా కూడా అంత విలువగలదిగా ఉండేది.
×

Alert

×