1
|
యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. |
2
|
వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు |
3
|
కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును. |
4
|
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు. |
5
|
దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును |
6
|
అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. |
7
|
వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు. |
8
|
వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. |
9
|
వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. |
10
|
భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును. |
Psalms 112:2 Hindi Language Bible Words basic statistical display
COMING SOON ...