Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Judges Chapters

Judges 17 Verses

Bible Versions

Books

Judges Chapters

Judges 17 Verses

1 మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ ములో నుండెను.
2 అతడు తన తల్లిని చూచినీ యొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లినా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను.
3 అతడు ఆ వెయ్యిన్నినూరు రూకలను తన తల్లికి మరల నియ్యగా ఆమెపోతవిగ్రహము చేయించుటకై నా కుమారునిచేత తీసికొనిన యీ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించు చున్నాను, నీకు మరల అది యిచ్చెదననెను.
4 అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండువందలు పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్క బడిన ప్రతిమాస్వరూపమైన పోతవిగ్రహమును చేయగా అది మీకా యింట ఉంచబడెను.
5 మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారు లలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.
6 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.
7 యూదా బేత్లెహేములోనుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక ¸°వనుడుండెను. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను.
8 ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీ యుల మన్యదేశముననున్న మీకా యింటికి వచ్చెను.
9 మీకానీవు ఎక్కడనుండి వచ్చితివని అతని నడుగగా అతడునేను యూదా బేత్లెహేమునుండి వచ్చిన లేవీయు డను, నాకు దొరుకగల చోట నివసించుటకు పోవు చున్నానని అతనితో అనెను.
10 మీకానా యొద్ద నివ సించి నాకు తండ్రివిగాను యాజకుడవు గాను ఉండుము; నేను సంవత్సరమునకు నీకు పది వెండి రూకలును ఒక దుస్తు బట్టలును ఆహారమును ఇచ్చెదనని చెప్పగా ఆ లేవీ యుడు ఒప్పుకొని
11 ఆ మనుష్యునియొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ ¸°వనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను.
12 మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని యింట నుండెను.
13 అంతట మీకాలేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలుచేయునని యిప్పుడు నాకు తెలి యును అనెను.

Judges 17 Verses

Judges 17 Chapter Verses Hindi Language Bible Words display

COMING SOON ...

×

Alert

×