ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను.
యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.
ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?
మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదే మనగాఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను
మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.
మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్పవేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు.
తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸°వనులు దర్శనములు చూతురు.