యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించువారిచేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాతయెహోవా మందిర మందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దాని నియ్యవలె ననియు
అంతట ప్రధానయాజకుడైన హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథ మును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి
తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా
మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.
యెహోవా సెలవిచ్చునదేమనగాయూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగాఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీ కరించియున్నాను.
నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చు దును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు.నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజు నొద్దకు తెచ్చిరి.