1
|
కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని యెంచి, |
2
|
యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు, |
3
|
మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; |
4
|
అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. |
5
|
ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని. |
6
|
తిమోతియు ఇప్పుడు మీ యొద్దనుండి మాయొద్దకు వచ్చి,మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. |
7
|
అందుచేత సహోదరు లారా, మా యిబ్బంది అంతటి లోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితివిు. |
8
|
ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే. |
9
|
మేము మీ ముఖముచూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, |
10
|
మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము? |
11
|
మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక. |
12
|
మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, |
13
|
మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభి వృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. |
1-Thessalonians 3:9 Hindi Language Bible Words basic statistical display
COMING SOON ...