1
|
ఏడవ నెల మొదటితేదిన మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. |
2
|
మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము. |
3
|
నిర్దోష మైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. |
4
|
వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్య మైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను యెహో వాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. |
5
|
వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతు లను, పొట్టేలుకు రెండు పదియవవంతులను, |
6
|
ఏడు గొఱ్ఱ పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. |
7
|
ఈ యేడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు. |
8
|
ప్రాయ శ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్ప ణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను. |
9
|
నూనెతో కలుప బడిన పిండిని నైవేద్య ముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవ వంతులను ఒక పొట్టేలుతో రెండు పది యవవంతులను |
10
|
ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును |
11
|
పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. |
12
|
మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను. |
13
|
నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహో వాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను. |
14
|
నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను |
15
|
ఆ పదునాలుగు గొఱ్ఱపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా |
16
|
ఒక మేక పిల్లను అర్పింవలెను. |
17
|
రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండుకోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధిప్రకారముగా, |
18
|
వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును |
19
|
పానార్ప ణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను. |
20
|
మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను |
21
|
విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను |
22
|
పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. |
23
|
నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, |
24
|
ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లల తోను వాటి నైవేద్యమును పానార్పణములను |
25
|
పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. |
26
|
అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమి్మది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, |
27
|
ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱ పిల్లలతోను |
28
|
వాటి వాటి నైవేద్యమును పానార్పణము లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను. |
29
|
ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడె లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, |
30
|
ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను |
31
|
పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. |
32
|
ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడ లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, |
33
|
ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను |
34
|
పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. |
35
|
ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయ కూడదు. |
36
|
అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, |
37
|
ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱపిల్లలతోను |
38
|
వాటి వాటి నైవేద్యమును పానార్పణ ములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. |
39
|
మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను. |
40
|
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను. |
Numbers 29:5 English Language Bible Words basic statistical display
COMING SOON ...