1
|
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము; |
2
|
నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను. |
3
|
ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. |
4
|
వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను. |
5
|
మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను. |
6
|
మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్య ములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. |
7
|
సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. |
8
|
అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్య మైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. |
9
|
మిమ్మును బాధించు శత్రువులకు విరోధ ముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవు డైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు. |
10
|
మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభ ములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే. |
11
|
రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి. |
12
|
తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. |
13
|
యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. |
14
|
యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. |
15
|
ఇశ్శాఖారీయుల గోత్రసైన్య మునకు సూయారు కుమారుడైన నెతనేలు అధి పతి. |
16
|
జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. |
17
|
మందిరము విప్పబడి నప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి. |
18
|
రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. |
19
|
షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీ యేలు అధిపతి. |
20
|
గాదీయుల గోత్రసైన్యమునకు దెయు వేలు కుమారుడైన ఎలీయా సాపు అధిపతి. |
21
|
కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిర మును నిలువబెట్టిరి. |
22
|
ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. |
23
|
పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. |
24
|
గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి. |
25
|
దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి |
26
|
ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్య మునకు అధిపతి. |
27
|
ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్య మునకు అధిపతి. |
28
|
ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయు నప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. |
29
|
మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషేయెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా |
30
|
అందు కతడునేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను. |
31
|
అందుకు మోషేనీవు దయ చేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు. |
32
|
మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. |
33
|
వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. |
34
|
వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను. |
35
|
ఆ మందసము సాగినప్పుడు మోషేయెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను. |
36
|
అది నిలిచినప్పుడు అతడుయెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను. |
Numbers 10:36 English Language Bible Words basic statistical display
COMING SOON ...