1
|
నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట |
2
|
నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు. |
3
|
అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని. |
4
|
అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు. |
5
|
జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. |
6
|
జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి |
7
|
తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే. |
8
|
అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును |
9
|
షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును |
10
|
ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును |
11
|
యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు |
12
|
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును. |
13
|
జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును |
14
|
జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు |
15
|
బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును |
16
|
బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును |
17
|
అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును |
18
|
అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును |
19
|
బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును |
20
|
అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును |
21
|
హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును |
22
|
హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును |
23
|
జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును |
24
|
హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును |
25
|
గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును |
26
|
బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును |
27
|
అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు |
28
|
బేతజ్మావెతువారు నలువది యిద్దరును |
29
|
కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును |
30
|
రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును |
31
|
మిక్మషువారు నూట ఇరువది యిద్దరును |
32
|
బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును |
33
|
రెండవ నెబోవారు ఏబది యిద్దరును |
34
|
రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును |
35
|
హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు |
36
|
యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును |
37
|
లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును |
38
|
సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు |
39
|
యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును |
40
|
ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును |
41
|
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును |
42
|
హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును |
43
|
లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును |
44
|
గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును |
45
|
ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశ స్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురునుొ |
46
|
నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు |
47
|
కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు |
48
|
లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు |
49
|
హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు |
50
|
రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు |
51
|
గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు |
52
|
బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు. |
53
|
బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు |
54
|
బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు |
55
|
బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులునెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు |
56
|
సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు |
57
|
సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు |
58
|
యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు |
59
|
షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు. |
60
|
ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు. |
61
|
తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి. |
62
|
వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు |
63
|
హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు. |
64
|
వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి. |
65
|
కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. |
66
|
సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది. |
67
|
వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి. |
68
|
వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును |
69
|
వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను. |
70
|
పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను. |
71
|
మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి. |
72
|
మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి. |
73
|
అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి. |
Nehemiah 7:27 English Language Bible Words basic statistical display
COMING SOON ...