1
|
లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము, |
2
|
దోచు కొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రా యేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును. |
3
|
ఆయన బలా ఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళ దారుమయమైన యీటెలు ఆడు చున్నవి; |
4
|
వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కన బడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి, |
5
|
రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. |
6
|
నదులదగ్గరనున్న గుమ్మ ములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది. |
7
|
నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టు కొనుచు మూల్గుచున్నారు. |
8
|
కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవు చున్నారు; నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. |
9
|
వెండి కొల్లపెట్టుడి, బంగా రము కొల్లపెట్టుడి, అది సకలవిధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేక యున్నవి. |
10
|
అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. |
11
|
సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థల మేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమా యెను? |
12
|
తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను? |
13
|
నేను నీకు విరోధినై యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మింగివేయును, నీకిక దొరకకుండ భూమిలోనుండి నీవు పట్టుకొనిన యెరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. |
Nahum 2:12 English Language Bible Words basic statistical display
COMING SOON ...