Indian Language Bible Word Collections
Mark 3:1
Mark Chapters
Mark 3 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Mark Chapters
Mark 3 Verses
1
|
సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. |
2
|
అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి. |
3
|
ఆయననీవు లేచి న మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి |
4
|
వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి. |
5
|
ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచినీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. |
6
|
పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. |
7
|
యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను, |
8
|
మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. |
9
|
జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. |
10
|
ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి. |
11
|
అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడినీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి. |
12
|
తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. |
13
|
ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారా యన యొద్దకు వచ్చిరి. |
14
|
వారు తనతో కూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు |
15
|
అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను. |
16
|
వారెవర నగాఆయన పేతురను పేరుపెట్టిన సీమోను |
17
|
జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. |
18
|
అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, |
19
|
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. |
20
|
ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. |
21
|
ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. |
22
|
యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులుఇతడు బయల్జె బూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. |
23
|
అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? |
24
|
ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. |
25
|
ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు. |
26
|
సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును. |
27
|
ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. |
28
|
సమస్త పాపములును మను ష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని |
29
|
పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. |
30
|
ఎందు కనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. |
31
|
ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. |
32
|
వారుఇదిగో నీ తల్లియు నీ సహోదరు లును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయ నతో చెప్పగా |
33
|
ఆయననా తల్లి నా సహోదరులు ఎవరని |
34
|
తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; |
35
|
దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను. |