1
|
ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. |
2
|
భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. |
3
|
సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను. |
4
|
కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి. |
5
|
అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను. |
6
|
జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. |
7
|
అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువుగలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. |
8
|
అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. |
9
|
సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పు కొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. |
10
|
కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరుదేవుని మహాశక్తి యనబడిన వాడు ఇతడే అని చెప్పు కొనుచు అతని లక్ష్యపెట్టిరి. |
11
|
అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్య పెట్టిరి. |
12
|
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు చుండగా వారతని నమి్మ, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. |
13
|
అప్పుడు సీమోనుకూడ నమి్మబాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలున ు గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. |
14
|
సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి. |
15
|
వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి. |
16
|
అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండ లేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. |
17
|
అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. |
18
|
అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి |
19
|
వారియెదుట ద్రవ్యము పెట్టినేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. |
20
|
అందుకు పేతురునీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక. |
21
|
నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. |
22
|
కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును; |
23
|
నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. |
24
|
అందుకు సీమోనుమీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. |
25
|
అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. |
26
|
ప్రభువు దూతనీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను. |
27
|
అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూష లేమునకు వచ్చియుండెను. |
28
|
అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను. |
29
|
అప్పుడు ఆత్మ ఫిలిప్పుతోనీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను. |
30
|
ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా వినినీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా |
31
|
అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడు కొనెను. |
32
|
అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. |
33
|
ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది. |
34
|
అప్పుడు నపుంసకుడుప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను. |
35
|
అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను. |
36
|
వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. |
37
|
ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. |
38
|
అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. |
39
|
వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు. |
40
|
అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణము లన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. |
Acts 8:29 English Language Bible Words basic statistical display
COMING SOON ...