1
|
అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి |
2
|
వారుపరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. |
3
|
అప్పుడతడుఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారుయోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి. |
4
|
అందుకు పౌలుయోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. |
5
|
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. |
6
|
తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. |
7
|
వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు. |
8
|
తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసం గించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. |
9
|
అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన |
10
|
రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి. |
11
|
మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుత ములను చేయించెను; |
12
|
అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను. |
13
|
అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులుపౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేస |
14
|
యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి. |
15
|
అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా |
16
|
ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి. |
17
|
ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘన పరచబడెను. |
18
|
విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసియొప్పుకొనిరి. |
19
|
మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను. |
20
|
ఇంత ప్రభా వముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. |
21
|
ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మన స్సులో ఉద్దేశించినేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను. |
22
|
అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను. |
23
|
ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను. |
24
|
ఏలాగనగాదేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. |
25
|
అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును. |
26
|
అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జన మును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున |
27
|
మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంత టను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను. |
28
|
వారు విని రౌద్రముతో నిండిన వారైఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి; |
29
|
పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమి్మగా నాటకశాలలో చొరబడిరి. |
30
|
పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు. |
31
|
మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహి తులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపినీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి. |
32
|
ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాల మందికి తెలియలేదు. |
33
|
అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. |
34
|
అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపుఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి. |
35
|
అంతట కరణము సమూహమును సముదాయించిఎఫెసీయులారా, ఎఫె సీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు |
36
|
ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్య కము. |
37
|
మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. |
38
|
దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును. |
39
|
అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అదిక్రమమైన సభలో పరిష్కారమగును. |
40
|
మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణ లోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. |
41
|
అతడీలాగు చెప్పి సభను ముగించెను. |
Acts 19:22 English Language Bible Words basic statistical display
COMING SOON ...