అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొనినిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?
దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదననెను.
అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపిఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదుమంచిది; నేను నీతో నిబంధన చేసెదను.
నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.
మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను.
అంతట అబ్నేరునేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.
పిమ్మట దావీదు సేవకులును యోవాబును బందిపోటునుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసికొనిరాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను, దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి యుండెను.
అయితే యోవాబును అతనియొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు, అతడు సమాధానముగా వెళ్లిపోయెననియు తెలిసికొని
దావీదునొద్దనుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా యను బావిదగ్గరనుండి అతనిని తోడుకొని వచ్చిరి; అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను.
అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడుసంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.
ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగానేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే.
ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసిసూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.
పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడు చేయునుగాక.